Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో మళ్లీ చిరుజల్లులు మొదలయ్యాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో(గంటకు 30-40 కి.మీ వేగంతో) వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే రాగల వారం రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పిడుగుపాటు హెచ్చరికలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉందని, వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉదయం భానుడి భగభగలు, సాయంత్రం కూల్
ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమే తేలికపాటి వర్షం కురుస్తుంది. ఉరుములు మేరుపులతో పిడుగులు కూడా పడుతున్నాయి. గురువారం హైదరాబాద్ నగరంలో మోస్తరువర్షం కురిసింది. కానీ ఈదురుగాలులతో పలు కాలనీల్లో చెట్లు నేలకూలాయి. ట్రాఫిక్ జామ్ తో నగరవాసులు ఇబ్బంది పడ్డారు.
Also Read : Coronavirus Cases India: ఆఫీసుకెళ్తున్నారా? ఆగండాగండి! ఇంకొన్ని రోజులు ఇంటివద్దే పని చేయమంటున్న కంపెనీలు