హైదరాబాద్ పేరు మార్పుపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైద‌రాబాద్ పేరు ఒక్కటే కాదని తెలంగాణ‌లో అనేక‌ ప్రాంతాల పేర్లు మారుస్తామని ఆయన అన్నారు. హైద‌రాబాద్ పేరును భాగ్యన‌గ‌ర్ గా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ మీటింగ్ అంటూ అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. 


చాలా పేర్లు మారుస్తాం : రాజాసింగ్


'బీజేపీ ప్రాపగాండ చేయాల్సిన అవ‌స‌రం లేదు. మేం బ‌రాబర్ భాగ్యనగ‌రంగా మారుస్తాం. భార‌తీయ జ‌న‌తాపార్టీ ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దీనిపై ప్రక‌ట‌న కూడా చేశారు. ఒక్క భాగ్యన‌గ‌రం పేరేకాదు సికింద్రబాద్, క‌రీంన‌గ‌ర్, నిజ‌మాబాద్ ల‌తో పాటు మిగ‌తా న‌గ‌రాల పేర్లూ మారుస్తాం. నిజం సర్కార్ బలవంతంగా మార్చిన పేర్లు అన్నింటినీ తిరిగి మారుస్తాం. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టగానే పేర్లు మారుస్తాం. నిజాం దౌర్జాన్యాన్ని ప్రజ‌ల ముందు పెడ‌తాను.' అని రాజాసింగ్ అన్నారు. దేశం కోసం  అమ‌రులైన వారి పేర్లను జిల్లాల‌కు పెడ‌తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కొంత మంది కావాలనే ఆర్ఎస్ఎస్ మీటింగ్ పై త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 


Also Read: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్ - తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !


ఆర్ఎస్ఎస్ ట్వీట్‌పై దుమారం


వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 3 రోజుల సమన్వయ్‌ బైఠక్‌ సమావేశాలను ఏర్పాటు చేసింది. కార్యక్రమ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ దుమారం రేపుతుంది. అందులో హైదరాబాద్‌కు బదులు ఏకంగా భాగ్యనగరం అనే పేరును వాడారు. ‘సామాజిక జీవితంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తల సమన్వయ్ బైఠక్ (సమన్వయ సమావేశం) 2022 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణలోని భాగ్యనగర్‌లో జరగనుంది’ అంటూ ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకార్ ట్వీట్‌ చేశారు.


Also Read: కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !






ఇలా హైదరాబాద్‌కు బదులుగా భాగ్యనగర్‌ అని పేర్కొనడంపై దుమారం రేగుతున్నది. గత అసెంబ్లీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలపై ఆ సమయంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆర్ఎస్ఎస్ ట్వీట్ పై దుమారం రేగడంతో రాజాసింగ్ స్పందించారు. 


Also Read: ఒక్క ఎకరా కబ్జా అని తేలినా ముక్కు నేలకు రాస్తా.. చదువుకున్న.. ఆ చదువులేని కలెక్టర్‌పై కేసు పెడతా: ఈటల


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి