Hyderabad Metro : ఐపీఎల్ మ్యాచ్ లకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే ఈ సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఆదివారం ఉప్పల్ లో జరిగి ఐపీఎల్ మ్యా్చ్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు మెట్రో రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. నాగోల్-అమీర్ పేట మార్గంలో అదనపు రైళ్లు నడుపుతున్న మెట్రో అధికారులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అదనపు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ లు
నాలుగేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భాగ్యనగారానికి మళ్లీ క్రికెట్ పండుగ వచ్చింది. 2019 తర్వాత హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. నాలుగేండ్ల క్రితం వరకూ ఐపీఎల్ ఫీవర్‌తో దేశంలోని మిగతా నగరాలూ ఊగిపోయినట్టే భాగ్యనగరం కూడా పరుగుల జడివానలో తడిసి ముద్దయ్యేది. కానీ మాయదారి రోగం కరోనా కారణంగా మధ్యలో మూడు సీజన్లు ఆంక్షల వలయంలో జరిగిన ఐపీఎల్.. ఈ సీజన్ నుంచి ‘ఇంటా బయటా’ (హోం అండ్ అవే) విధానంలో జరుగుతున్నది.
హైదరాబాద్ లో మ్యాచ్ లు
⦿ ఏప్రిల్ 2వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ (వేదిక)
⦿ ఏప్రిల్ 9వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - హైదరాబాద్
⦿ ఏప్రిల్ 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - హైదరాబాద్
⦿ ఏప్రిల్ 24వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - హైదరాబాద్
⦿ మే 4వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - హైదరాబాద్
⦿ మే 13వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - హైదరాబాద్
⦿ మే 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - హైదరాబాద్
ఉప్పల్ దంగల్‌లో..
2004లో నిర్మితమైన ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు 64 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. అయితే ఇందులో గతంలో ఉన్న డెక్కన్ ఛార్జర్స్ మ్యాచ్ లను తీసేస్తే.. 2013 నుంచి డీసీ స్థానంలో వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ 49 మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ హై స్కోరింగ్ గేమ్స్ కంటే మోస్తారు (130 - 160) స్కోర్లే ఎక్కువగా నమోదయ్యాయి. 100 -150 మధ్య స్కోర్లు ఏకంగా 32 సార్లు నమోదయ్యాయి. 200 ప్లస్ స్కోర్లు 8 సార్లు రికార్డయ్యాయి. ఉప్పల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 27 మ్యాచ్ లను గెలవగా ఛేదన చేసిన జట్టు 37 సార్లు గెలిచింది. ఉప్పల్ లో భారీ స్కోర్ల గేమ్స్ కంటే లో డిఫెండింగ్ స్కోర్లే ఎక్కువ. బ్యాటర్లతో పాటు బౌలర్లకూ అనుకూలించే ఈ పిచ్ పై ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ల గురించి హైదరబాద్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.