Governor At Home : తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొంటారని ముందు సమాచారం వచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్  హాజరవుతారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో నుంచి ముందుగా సమాచారం వచ్చింది. కానీ సీఎం కేసీఆర్ ఎట్ హోమ్ కు గౌర్హాజరు అయ్యారు. సీఎం వెళ్లకపోవడంతో మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు కూడా హాజరుకాలేదు. 






రేవంత్, బండి సంజయ్ కూడా 


తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, హైదరాబాద్ సీపీ ఆనంద్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాత్రమే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ చివరగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారంలో కలిసి పాల్గొన్నారు. అయితే కరోనా కారణంగా తేనేటి విందుకు హాజరు కాలేకపోతున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గవర్నర్ కార్యాలయానికి సమాచారం పంపారు. పాదయాత్ర కారణంగా రాలేకపోతున్నానని బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. 


ఎట్ హోమ్ లో సీఎం జగన్, చంద్రబాబు 


ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాజ్‌భవన్‌లో తేనీటి విందు (At Home) కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్‌భవన్‌ చేరుకున్న సీఎం జగన్‌ దంపతులకు గవర్నర్‌ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు మంత్రులు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.  సీఎం జగన్, చంద్రబాబు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే ఇరువురు నేతలు కలిస్తారని అందరూ భావించారు. కానీ ఇరువురు నేతలు కలిసే సందర్భం రాలేదు. ఎట్ హోమ్ కార్యక్రమానికి ముందుగా వచ్చిన చంద్రబాబు గవర్నర్ ను కలిసి వెళ్లిపోయారు. పవన్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని ప్రచారం జరిగింది ఆయన ఎట్ హోమ్ కు హాజరు కాలేదు. 


Also Read : Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి


Also Read : Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు