Jairam Ramesh : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారభించారని ఏఐసీసీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన... రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు దసరా సందర్భంగా పాదయాత్రకు విరామం ఇచ్చారన్నారు. అక్టోబర్ 6వ తేదీన రాహుల్ గాంధీ పాదయాత్రలో సోనియాగాంధీ పాల్గొననున్నారన్నారు. తమిళనాడులో 62, కేరళ 352, కర్నాటక లో 511, ఏపీలో 62, తెలంగాణలో 360 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో 4 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందన్నారు. ప్రతి రోజు 21 కిలోమీటర్ల రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని జైరాం రమేష్ తెలిపారు.  తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పాదయాత్ర వెళ్తుందన్నారు. 3570 కిలోమీటర్లు పాదయాత్ర 160 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.  


భారత్ జోడో యాత్రకు మంచి స్పందన 


"భారత్ జోడో యాత్ర మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పాదయాత్ర ఉదయం 6:30కి ప్రారంభమై 10:30కి ముగుస్తుంది. సాయంత్రం 4కి ప్రారంభమై రాత్రి 8:30కి ముగుస్తుంది. ప్రతిరోజు సాయంత్రం వివిధ వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఇది మనకి బాత్ యాత్ర కాదు. జనతా యాత్ర. ఎకానమీ తగ్గుదల, నిరుద్యోగ, జీఎస్టీ, పరిశ్రమలు, సామాజిక , కుల, భాష ,మతాల వారీగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ విభజిస్తూ పాలిస్తుంది. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను సంఘటితం చేయడానికే. తమిళనాడు, కేరళ మంచి స్పందన వచ్చింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వారందరినీ సమైక్యత కోసమే ఈ యాత్ర. 360 కిలోమీటర్లలో జరిగే యాత్రపై ఉండే ఏర్పాట్లపై ఈరోజు సమావేశం నిర్వహించాం." - జైరాం రమేష్ 


కేసీఆర్ కు వీఆర్ఎస్ సమయం 


అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయని జైరాం రమేష్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ఒకే నాణేనికి ఉన్న రెండు వైపులా లాంటివన్నారు. కేసీఆర్ కు ఈ సమయంలో బీఆర్ఎస్ కాదని, వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్) అవసవరమని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయన్నారు. డబుల్ ఇంజిన్ లో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్ఎస్ అని విమర్శించారు. 


 సంవిధన్ బచావో


తెలంగాణ లో భారత్ జోడోయాత్ర 13 రోజుల కార్యక్రమంగా చూడకూడదన్నారు కాంగ్రెస్ నేత కొప్పుల రాజు. తెలంగాణ కాంగ్రెస్ భారత్ జోడోయాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లబోతుందన్నారు. తెలంగాణలోని పార్టీ అనుబంధ సంఘాల్లోని 8 డిపార్ట్మెంట్ లు సంవిధన్ బచావో పేరుతో కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు. సంవిధన్ బచావ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గడపగడపకు వెళ్తుందన్నారు. 


Also Read : AP Special Status : కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ - జైరాం రమేష్ హామీ !