హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్  ఒత్తిడికి గురయినా నిష్పక్షపాతంగా వ్యవహరించారని.. తాము ఉన్న ప్రాంతాలను తనిఖీ చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సభ పెట్టినప్పుడు అనుమతి ఇచ్చారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ సభ పెట్టకుండా కోడ్ వర్తింపచేసేలా ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేశారు. 2001లో మొదలుపెట్టిన సింహగర్జన నాటి నుండి ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ వచ్చారని... ఇప్పుడే అదే సీన్ రిపీట్ అవుతుందన్నారు. చివరి నిమిషంలో కుట్రలు జరిగే అవకాశం ఉందని, ఓటర్లకు అన్ని విషయాలు తెలుసన్నారు.


టీఆర్ఎస్ గెలిస్తే ఏం చేస్తుంది...
‘హుజూరాబాద్ ఉప ఎన్నికలపై అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ గెలుపు  తథ్యమని వచ్చింది. బీజేపీ సర్వేల్లోను విజయం టీఆర్ఎస్ ను వరిస్తుందని వచ్చింది. పాపం కొద్ది మంది ఫోన్లు పగులగొట్టారట. టీఆర్ఎస్ గెలిస్తే ఏం చేస్తామో చెప్పాం. కాని బీజేపీ ఒక్క ముక్క చెప్పలేదు. ప్రచారం మొదలైన నాటి నుంచి నేటి వరకు నేను విసిరిన ఒక్క సవాల్ కూడా బీజేపీ నేతలు స్వీకరించలేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి వంటి వాళ్లు కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు మండిపడ్డారు.


Also Read: హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !


ఎటుచూసినా దుష్ప్రచారమే..
టీఆర్ఎస్ పార్టీ ఓటుకు 20 వేలు ఇస్తున్నారని దుష్ప్రచారం చేశారు. మీరు డబ్బులు, మద్యం, మాంసం నమ్ముకున్నారు. టీఆర్ఎస్ మాత్రం కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు లాంటి పథకాలను నమ్ముకుంది. ఏడేళ్లలో ఏం చేశాం. మా మ్యానిఫెస్టోను ఎలా అమలుచేశాం చెప్పాం. కానీ బీజేపీ ఈ ఏడేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. మీకు విషయం లేకనే మాపై దుష్ప్రచారం చేశారు. నలుగురు కేంద్ర మంత్రులు, బండి సంజయ్, వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి  ఇంకా బీజేపీ డజను మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, గత నెలరోజులుగా హుజూరాబాద్ గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేశారు. కానీ ఒక్క విషయంపై చర్చకు రాలేదన్నారు.


Also Read: Huzurabad By Election: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్‌.. కాదు.. కాదంటున్న బీజేపీ


పెట్రోల్, డీజీల్, మంచినూనె ధర, గ్యాస్ ధరల పట్ల ప్రజల ఆక్రోశం కనబడుతోంది. గ్యాస్ బండకు దండం పెట్టు, బీజేపీని బొంద పెట్టు అనే నినాదంపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఉజ్వల గ్యాస్ పై బండి సంజయ్ దుష్ప్రచారం చేశారు. దళిత బంధుపై లేఖ రాసి పథకం రాకుండా అడ్డుకున్న ఘనత బీజేకి సొంతం. చివరి నిమిషంలో కుట్రలు జరుగుతాయి. కానీ ఓటర్లు అన్ని గమనిస్తున్నారు. కనుక హుజూరాబాద్ లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నమ్ముతున్నామని హరీష్ రావు అన్నారు. 


రైతుకు ఓ సంఘం ఉందా.. రైతు బంధు సమితులు పెట్టాం, రైతు వేదికలు ఏర్పాటు చేశాం. బీజేపీకి రైతుల గురించి, దళితుల కోసం మాట్లాడే అర్హత లేదు. మా నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. ఎన్ని చెక్క డ్యాంలు కట్టాం. చెరువులు పూడిక తీసాం, కాళేశ్వరం నీరు  ఇచ్చింది టీఆర్ఎస్ విజయం కాదా.. పసుపు బోర్డు తెస్తా అని చెప్పిన ఒకతను చివరికి ప్రజలను మోసం చేశాడు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మురళీధరన్ కు ఇక్కడ ఏం పని అని మంత్రి ప్రశ్నించారు. ఇంటింటికి నీళ్లు అని బీజేపీ చెప్పడం పెద్ద జోక్ అనిపిస్తుంది, నాలుగేళ్ల కిందటే టీఆర్ఎస్ ఆ పని చేసిందన్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి