ABP  WhatsApp

Dalita Bandhu: హుజూరాబాద్ లో దళితబంధుకు బ్రేక్.. ఈసీ కీలక ఆదేశాలు

ABP Desam Updated at: 18 Oct 2021 08:21 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

హుజూరాబాద్ లో దళితబంధు పథకం అమలుకు ఈసీ బ్రేక్ వేసింది. హుజూరాబాద్ లో దళితబంధు అమలను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది.

సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

NEXT PREV

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల కారణంగా దళితబంధు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో దళితబంధు అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉపఎన్నిక దృష్ట్యా దళిత బంధు పథకాన్ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాసింది. ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది.


Also Read: రూ.1.7 లక్షల కోట్లతో రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తాం.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు


దళిత బంధుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు


టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రాణం పోయినా ఆపేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ పుణ్యమా అని ఎస్సీల‌కు రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు అందాయని.. కొంత‌ మంది పిల్లలు చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందారన్నారు. చట్టసభలలో వారికి సరైన ప్రాతినిథ్యం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎంత పెద్ద య‌జ్ఞమో అందరికీ తెలుసు.. అలాంటిది ద‌ళిత బంధును విజ‌య‌వంతం చేయ‌డం అంత కంటే పెద్ద య‌జ్ఞం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 



రాష్ట్రంలో భారీ సంఖ్యలో ద‌ళితులు ఉన్నారు. దాదాపు 75 ల‌క్షల మంది ద‌ళితులు ఉండగా.. వారి వద్ద చాలా తక్కువ భూమి ఉంది. ద‌ళితుల వ‌ద్ద 13 ల‌క్షల ఎక‌రాల భూమి మాత్రమే ఉంది. జనాభా ఎక్కువగా ఉన్నారు కానీ అవకాశాలు వారికి దక్కలేదు. వారి భూమి ఎవరి వద్ద ఉందో కూడా వారికి తెలియని పరిస్థితి ఉండేది. అందుకే దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి నియోజకవర్గానికి దళితబంధును తప్పకుండా అమలు చేసి తీరుతాం- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి


రూ.1.7 లక్షల కోట్లు దళితబంధుకు ఖర్చు


తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. వచ్చే ఏడేళ్ల కాలంలో రూ.1.7 లక్షల కోట్లు దళితబంధుకు ఖర్చు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడితో రూ.10 లక్షల కోట్లు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. దేశంలోని దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచిగా మారాలి. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులు సహా అన్ని వర్గాలవారు బాగు పడతారని ఉద్యమం చేపట్టి, విజయం సాధించాం. కానీ ఎన్నో అవమానాలు భరించాను. చివరికి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు అన్ని వర్గాల వారికి ఫలాలు అందుతున్నాయని’ సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 18 Oct 2021 08:05 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.