Rythu Bandhu politics :  తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్‌ పై బీఆర్ఎస్ మెల్లగా విమర్శలు ప్రారంభిస్తోంది.  రైతు బంధు స్కీమ్ నిధుల పంపిణీపై మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.  అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు డబ్బులు ఇస్తామని చెప్పారు, వడ్లు అమ్ముకోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని రైతులకు చెప్పారు, రైతు బంధు పెంచుతామని హామీ ఇచ్చారు.. మరీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు ఎప్పుడూ కొంటారు, పెంచిన రైతు బంధు ఎప్పటి నుండి ఇస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.             


 తన్నీరు హరీశ్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బిఆర్ఎస్ హయంలో ఈ పథకం నిబంధనలను ఇష్టానుసారంగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పడు పెద్ద ఫౌంహౌస్ ల ఓనర్లు, మంత్రులు రైతుబంధు రాలేదని బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. ఇది రైతు ప్రభుత్వం అన్న సీతక్క అన్ని పథకాలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.                     


అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిసాయని, వాళ్ళను ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి రూ.15,000 డిసెంబర్ 9వ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు రైతుబంధు ఇస్తారో చెప్పాలని రైతుల పక్షాన తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.


 









 


ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ హామీైలు ఇచ్చింది. వాటిని అమలు చేయాల్సి ఉంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా  రెండు గ్యారంటీలను అమలు చేయడం ప్రారంభించారు.  ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అయినందున.. వెంటనే ప్రశ్నించడం ఏమిటని కొంత మంది బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.