Telangana Elections 2023 HarishRao :   తెలంగాణ భవన్‌‌లో మంగళవారం నిర్వహించిన 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు హాజర్యయారు. గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచిన చరిత్ర కేసీఆర్‌దని తెలిపారు.  ఆటో కార్మికులకు త్రైమాసిక పన్నును రద్దు చేసింది కేసీఆర్ .. ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసింది కూడా కేసీఆరేనని తెలిపారు.  ఆటో కార్మికులకు, రవాణా కార్మికుల ట్రాన్స్‌పోర్ట్ బోర్డు ఏర్పాటు డిమాండుని మూడోసారి అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 


మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపిస్తే ఆర్పీలు, వీఏవోల జీతాన్ని రెట్టింపు చేస్తామని.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఉద్యోగుల జీతాలు ఎక్కువని గుర్తు చేశారు.  కార్మికుల ఉసురుపోసుకున్న పార్టీ బీజేపీ అన్నారు.  రైల్వేలు, రైల్వే లైన్లు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీలను అమ్మేశారారన్నారు.  అమ్ముడు తప్ప కొత్తగా కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టడం బీజేపీకి తెలియదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తుస్సయిపోయాయని..  రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటలు ఇస్తమంటున్నడని ఎద్దేవా చేశారు.  గతంలో పవర్ హాలిడేలు ఉండేవి. పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసేవారు. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుందని గుర్తు చేశారు. 
 
తెలంగాణ ఏర్పడంగనే బీజేపీ ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేసింది. దాంతో సీలేరు విద్యుత్ ప్రాజెక్టు మనకు దక్కకుండా పోయిందిన్నారు.  తెలంగాణకు బీజేపీ ఇంత అన్యాయం చేసినా కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడలేదని ఆరోపించారు.  కేసీఆర్‌ని తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతున్నయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు.  
రెండు ఢిల్లీ పార్టీలు దేశమంతా కొట్టుకొని తెలంగాణలో కలిసి పని చేస్తున్నాయని..  బీజేపీ పార్లమెంటులో బిల్లు పెడితే కాంగ్రెస్ మద్ధతిస్తుందన్నారు.  మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్నోళ్లు బీజేపీలో, బీజేపీలో ఉన్నోళ్లు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ..  కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలని విమర్శించారు. 


కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని కాపీ కొట్టిందన్నారు.  కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలతో కొన్ని నెలల్లోనే ఆ రాష్ట్రం దివాలా తీసిందని..  కర్ణాటక గబ్బు పట్టిపోయింది. అక్కడి రైతులు లబోదిబోమంటున్నరని తెలిపారు.  మాట తప్పే కాంగ్రెస్ కావాల్నా, మాట మీద నిలబడే కేసీఆర్ కావాల్నా తేల్చుకోవాలని హరీష్ రావు సూచించారు.  తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక ఇంటి పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమేనన్నారు.  ఈ మధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ లు పోయి బీజేపీ గెలిచింది.  మునుగోడు లో కాంగ్రెస్ డిపాజిట్లు పోయి, బీజేపీ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి.  ఈ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. 


నిన్న మొన్నటి దాకా బీజేపీ లో.ఉన్న వివేక్, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారని..  మనల్ని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు.  కాంగ్రెస్ గట్టిగ ఉన్న చోట బీజేపీ సపోర్ట్ చేస్తుంది..  బిజెపి గట్టిగ ఉన్న చోట కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందన్నారు.  కాంగ్రెస్ హయాంలో కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదు.  గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించింది కాంగ్రెస్ ఆడవాళ్ళు అని చూడకుండా అర్దరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ దన్నారు.  కానీ కేసిఆర్ మహిళలను పిలిచి వారి సమస్యలు తీర్చి అన్నం పెట్టిన ఘనత కేసిఆర్ దని..  తెలిపారు.