హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ దళిత బంధు పథకంపై మంత్రులు  కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రూ.4.81 కోట్ల విలువైన వివిధ అసెట్స్ పంపిణీ చేశామన్నారు. లబ్దిదారులకు ఇదొక పండగ రోజు అన్నారు. ఇదివరకు డ్రైవర్ గా పనిచేసిన వాళ్లు ఇప్పుడు ఓనర్లు అయ్యారన్నారు. ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదన్నారు. దళిత సమాజం అంతా కేసీఆర్ కు రుణపడి ఉందన్నారు. ఈ పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. 17551 మంది లభ్దిదారులు ఈ పథకానికి ఎంపిక అయ్యారని తెలిపారు. వారి అకౌంట్లలో డబ్బులు జమయ్యాయని పేర్కొన్నారు. 



బీజేపీ రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేయగలరా...


బీజేపీ దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్న మంత్రి... దమ్ముంటే అక్కడ ఈ స్కీం అమలు చేసి చూపాలని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేస్తుంటే అవాకులు చవాకులు పెళుతున్నారన్నారు. ఐదు పడేండ్లలో అందరికీ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దళిత బంధు ఓట్ల కోసం ఖ్యాతి కోసం చేసింది కాదన్నారు. బీజేపీ దళిత, బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు. 
బడ్జెట్ అంత అంకెల గారడీ అన్నారు. దళిత, ఎస్సీలు, బీసీలకు బడ్జె్ట్ లో ఏం కేటాయింపులు చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. అవకాశం వస్తే రాజ్యాంగంలో మార్పులు చేయాలని సీఎం కేసీఆర్ అంటే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. 


రాజ్యాంగాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశం


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ...రూ.1737 కోట్లతో దళితబంధు పథకాన్ని అమలు చేశామన్నారు. కమలాపూర్ లో  3893 లబ్ధిదారులు ఉన్నారన్నారు. మూడు నాలుగు ఏళ్లలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్నారు. దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారదే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అంబేడ్కర్ ను గౌరవించే ఏకైక సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. అంబేడ్కర్ ను విమర్శించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టం చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. ఇంకా పేద వర్గాలకు న్యాయం జరగాలన్నదే కేసీఆర్ ఉద్దేశమన్నారు. 


Also Read: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారు... సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని