GVL Comments: ఆంధ్రప్రదేశ్ సర్కారుపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహా రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో పథకాల అమలు తీరుపై ఆరోపణలు చేశారు. బీజేపీకి చెందిన వారు అని తెలియగానే వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తున్నారని జీవీఎల్ ఫైర్‌ అయ్యారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల రేషన్ కార్డులపై అనర్హత వేటు వేయడమో, పింఛను ఆపు చేయించడమో చేస్తున్నారని అన్నారు. పథకాలు తొలగించే క్రమంగా సంబంధిత అధికారులు విచక్షణతో మెలగాలని జీవీఎల్ నరసింహా రావు సూచించారు.

  


ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం..


పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న జీవీఎల్.. ఆంధ్రాయేతర ప్రాంతాలకు చెందిన ఓటర్లను కావాలనే ఓటర్ల జాబితాలో నుంచి తొలగించినట్లు తెలిపారు. ఓటర్ల అక్రమ తొలగింపులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కనీసం 50 వేల ఓట్లను అధికార పార్టీ నాయకులు గల్లంతు చేశారని ఆరోపించారు. ఓట్ల తొలగింపు గోల్ మాల్ వ్యవహారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరినట్లు జీవీఎల్ నరసింహా రావు తెలిపారు. అందుకు చర్యలు మొదలయ్యాయని కూడా వెల్లడించారు. ఓట్ల తొలగింపు ఉద్దేశపూర్వకంగా చేసినట్లు రుజువైన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. 


ఢిల్లీలో తీగ- ఏపీ, తెలంగాణల్లో డొంక..


లిక్కర్ స్కామ్ పై ఢిల్లీలో డొంక కదిలితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మూలాలు వెలుగు చూస్తున్నాయని జీవీఎల్ అన్నారు. రెండు రాష్ట్రాల్లో అధికారపార్టీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో హిందూపూర్ లో 4,200 ఎకరాలు బ్యాంకులకు తనఖా పెట్టారని, ఆ భూములను 500 కోట్లకే ఒక ప్రైవేటు సంస్ధ చేజెక్కించుకుందంటే ఎంత దారుణమని జీవీఎల్ ప్రశ్నించారు.


విలువైన భూముల అడ్డగోలు కేటాయింపులు..


బెంగుళూరు కు అత్యంత విలువైన భూములను అడ్డగోలుగా కాజేసే చర్యలపై ఏపి ప్రభుత్వం స్పందిచదా అని ప్రశ్నించారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దిక్కు దివానా లేదని విమర్శించారు. ఎన్.సి.ఎల్.టి తో సంప్రదించి వివారాలు ఆరా తీస్తానని తెలిపారు. భూములను ఏ ప్రయోజనాల కోసం ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ అగ్రిమెంట్ పై జరిగిన అంశాలు తెలపాలని కోరారు. జగన్ ప్రభుత్వం దీనిపై వివరాలను కచ్చితంగా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే కొడుకు సదరు సంస్ధలో డైరెక్టర్ గా ఉన్నారని, వారికి ఉండే ఆసక్తి ఏంటో ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. లిక్కర్ స్కామ్ లో నిబంధనలు తుంగలోకి తొక్కరాని ఢిలీ చీఫ్ విజిలెన్స్ విభాగం నిర్ధారించిందని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని అన్నారు. 


'రాజకీయ ప్రస్తావన రాకుండా ఉంటుందా'


మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపైనా జీవీఎల్ ఆసక్తికర కామెంట్లు చేశారు. వారిద్దరి బేటీలో రాజకీయ ప్రస్తావన లేకుండా వుండగలదా అని అన్నారు. వారిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయో వారే చెప్పాలని పేర్కొన్నారు.


 పార్టీ బలోపేతానికి చర్యలు..


యువసంఘర్షణ సభ పెద్ద ఎత్తున విజయవంతమైందని, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పట్టు సాధించుకోబోతోందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. సెప్టెంబరు25 కల్లా బూత్ స్ధాయిలో కర్యకర్తలను యాక్టివ్‌ చేస్తామని తెలిపారు. అమిత్ షాను కూడా ఏపికి ఆహ్వానిస్తామని వెల్లడించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, వాన్‌పిక్, వైజాగ్ చెన్నై కారిడార్‌లలో ఒక్క ఇంచ్ పని కూడా జరగలేదని విమర్శించారు.