ABP  WhatsApp

Google Caste Discrimination Row : సుందర్ పిచాయ్ రాజీనామాకు భీమ్ ఆర్మీ డిమాండ్, కులాన్ని విచక్షణారహిత విధానాల్లో చేర్చాలని నిరసన

ABP Desam Updated at: 13 Jun 2022 05:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Google Caste Discrimination Row : గూగుల్ సంస్థ కులాన్ని విచక్షణారహిత విధానాలలో చేర్చాలని భీమ్ ఆర్మీ డిమాండ్ చేస్తుంది. అలా కుదరని పక్షంలో సుందర్ పిచాయ్ రాజీనామా చేయాలన్నారు.

భీమ్ ఆర్మీ సభ్యులు

NEXT PREV

Google Caste Discrimination Row :  గూగుల్ సంస్థ విచక్షణారహిత విధానాలలో కులాన్ని కూడా చేర్చాలని భీమ్ ఆర్మీ డిమాండ్ చేసింది. గూగుల్ కులాన్ని విచక్షణారహిత విధానాలలో చేర్చాలని అలాగే ప్రపంచ సంఘీభావ దినోత్సవాన్ని పాటించాలని పిలుపు నిచ్చింది. ఈ విషయమై భీమ్ ఆర్మీ నేతలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిరసన తెలిపారు. వాషింగ్టన్ జరిగిన ఓ సమావేశంలో క్యాస్ట్ విధానాలపై మాట్లాడేందుకు తన్మోజి సౌందర రాజన్ అవకాశం కల్పించకపోవడంపై మండిపడ్డారు. ఆమెను సమావేశానికి పిలిచి క్యాస్ట్ విధానంపై మాట్లాడకుండా చేయడం సరికాదన్నారు. అందుకు నిరసనగా ఆ కార్యక్రమం చేపట్టామన్నారు. టెక్ రంగంలో కుల వివక్షకు గురైన వారికి అండగా ఉంటామన్నారు. కులాన్ని సురక్షిత కేటగరీగా విచక్షణారహిత విధానాలలో కలపాలని డిమాండ్ చేస్తున్నామని తన్మోజి సౌందర రాజన్ అన్నారు. గూగుల్ వర్కర్లు సురక్షితమైన వర్క్ ఫోర్సులో ఉన్న దళిత మేనేజర్లు, ఇంజినీర్లు, లా స్పెషలిస్టులు, మోడరేటర్లు, స్వీపర్లను సురక్షిత కేటగిరిలో చేర్చాలన్నారు. భారతదేశంలోని గూగుల్ కార్యాలయాలలో కులం సురక్షితమైన కేటగరీగా గుర్తిస్తే ప్రపంచంలోని వర్క్ ఫోర్స్ లో అది చేరిపోతుందన్నారు. గూగుల్ దళితులను విచక్షణాపూరిత విధానాలతో ప్రపంచవ్యాప్తంగా బాధించడం ఆమోదయోగ్యం కాదన్నారు. గూగుల్ లో కుల ఛాందస వాదులు ఎక్కువై పోయారన్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. 



గూగుల్ యాజమాన్యం మోసం, విచక్షణపై తగిన చర్యలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దళితులను కుల విచక్షణకు గురిచేసి హింసించడం అనే నిర్ణయం సరైనదికాదు. ఈ విషయమై మోసగాళ్లను గూగల్ యాజమాన్యం సమర్దించడం,  సమాచారాన్ని నిలిపివేయడం సమర్థనీయమైన చర్యలు కావు. ఈ చర్యల వలన గూగుల్ యాజమాన్యం దళితుల విషయంలో మానవహక్కులను భంగం కలిగిస్తూ భారతీయ చట్టాల ద్వారా రక్షణ పొందే దళితులను పీడించినట్లు అవుతోంది. గూగుల్ దళితుల పట్ల తన వైఖరి మార్చుకోవాలని నిరసన చేస్తున్నాం. - -  భీమ్ ఆర్మీ  



ఈ డిమాండ్లపై సానుకూలంగా వ్యవహరించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్,  గూగుల్ మేనేజ్మెంట్ కోరుతున్నామని భీమ్ ఆర్మీ తెలిపింది.


1. కులాన్ని సురక్షిత కేటగిరీగా గుర్తిస్తూ గూగుల్ యాజమాన్యం విచక్షణా రహిత విధానాలలో చేర్చాలి.
2. కుల సమానత్వ తనిఖీని నిర్వహించి కంపెనీలో కులానికి జరుగుతున్న హాని తీవ్రతను గుర్తించాలి.
3) థెన్మోజి ఉపన్యాసం గూగుల్ సంస్థను ఉద్దేశించినది. దాని ప్రకారం కులం కారణంగా అణచివేతకు గురైన వారిని విచక్షణ, మోసం లేని కుల సమస్యల గురించి మాట్లాడనివ్వాలి
4) ఆల్ఫాబెట్ వర్కర్ల యూనియన్ ను గుర్తించాలి. వారితో పాటు పనిచేస్తూ పనిస్థలాలలో భద్రత, విచక్షణ అంశాలతో సమస్యలను పరిష్కరించాలి.


 

Published at: 13 Jun 2022 05:53 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.