కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో విద్యార్థినుల హాస్టల్‌లో దెయ్యం భయం అందరినీ భయపెడుతోంది. ఈ కారణంగా విద్యార్థినులు హాస్టల్ ఖాలీ చేసి ఇంటికి వెళ్లిపోతున్నారు.
ఇంతటి సాంకేతిక యుగంలో కూడా దెయ్యాలు ఉన్నాయనే అపనమ్మకంతో భయందోళనకు గురువుతున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేట ఆదర్శ పాఠశాల హాస్టల్ విద్యార్థినులు దెయ్యం ఉందని వింత శబ్దాలు వినిపిస్తున్నాయని భయపడుతున్నారు. భయంతో వసతి గృహాన్ని ఖాళీ చేశారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్స్‌లో భాగంగా చదువుకుంటున్న విద్యార్థినులకు గదిలో నీడలాగా ఒక ముఖం కనిపించిందని, వెనుకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని చెబుతున్నారు.
వింత శబ్దాలు వినిపించాయని విద్యార్థులు వార్డెన్ కు తెలిపారు. దీంతో అక్కడున్న వార్డెన్ కూడా భయంతో కంగారు పడ్డారు. బెదిరిపోయిన విద్యార్థినులు బుధవారం ఉదయమే సొంత ఊర్లకు వెళ్లిపోయారు. విద్యార్థినులు హోమ్‌సిక్ తోనే వెళ్లిపోయారని, తిరిగి రాగానే వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మోడల్‌స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత పేర్కొన్నారు.
చీకటి గదుల్లోనే విద్యార్థినిలు, లైట్లు లేక అవస్థలు
రాత్రివేళల్లో హాస్టల్ లో లైట్లు లేవని స్థానికులు చెబుతున్నారు. చీకటి ఉన్న కారణంగా విద్యార్థినులు భయపడి ఉండొచ్చని భావిస్తున్నారు. మోడల్ స్కూల్ హాస్టల్ లో సరైన వసతులు కల్పిస్తే బాగుంటుందని స్థానికులు చెబుతున్నారు. చీకటి కారణంగా విద్యార్థినులు భయపడి ఉండోచ్చని చెబుతున్నారు.
Also Read: Robbery: కుక్కలు చనిపోవడం, దోపిడీ చేశాక చంపేయడం.. ఇది ఆ గ్యాంగు పనేనా?
Also Read: Kurup Real Story: 38 ఏళ్ల మిస్టరీ.. పోలీసులకు చుక్కలు.. ఎవరీ కురుప్? అసలు ఉన్నాడా? పోయాడా?