రాజకీయ సభల నిర్వహణకు లేని అడ్డంకులు వినాయక చవితి పండుగ నిర్వహణకు ఎందుకని ప్రశ్నించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ . హిందూవుల మనోభావాలు కాపాడే విధంగా ప్రభుత్వాల చర్యలు ఉండాలి కానీ హిందూవుల పండగలకు, శుభకార్యాలకు అవరోధాలు సృష్టించడం ఏమాత్రం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు హిందూవుల మనో‌భావాలు గాయపరిచే విధంగా వినాయక చవితి వేడుకులకు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఇరు ప్రభుత్వాలు మరోసారి ఆలోచించి వినాయకచవితి వేడుకల నిర్వహణకు అనుమతులివ్వాలని కోరారు.


Also read: వినాయకచవితి పండుగను నియంత్రించడం వెనుక వేరే అజెండా ఉంది : విష్ణు వర్థన్ రెడ్డి


ఈరోజు ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంటేశ్వరస్వామిని దర్శించుకున్నారు లక్ష్మణ్. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు పట్టువస్త్రంతో సత్కరించి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. యావత్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళిని కరోనా ప్రభావం నుండి విముక్తి కల్పించాలని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని కరోనా బారినుంచి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.


దేశంలో కరోనా థర్డ్ వేవ్  ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించడంతో వినాయకచవితి వేడుకలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించవద్దని..ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని స్పష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై ఇప్పుడు దుమారం కొనసాగుతోంది.  మరోవైపు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఢిల్లీలోనూ వినాయకచవితి వేడుకలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.   కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వినాయక చవితి పండుగను బహిరంగంగా నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వట్లేదని తేల్చి చెప్పాయి ఆయా ప్రభుత్వాలు. కరోనా వైరస్ ఇంకా తొలగిపోలేదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.


Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..


Also read: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ ఐదు జిల్లాల వారికి అలెర్ట్..


Also read: ఇవాళ ఈ రాశుల వారు శుభవార్త వింటారు, ఆ రాశుల ఉద్యోగులకు అంతా శుభసమయమే..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!


Also read: పసిడి ప్రియులకు ఈ రోజు కూడా శుభవార్త..నిన్నటి కన్నా మరింత తగ్గిన బంగారం ధర