తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో సెప్టెంబర్ 17వ తేదీన దళిత,గిరిజన దండోరా సభ జరగనుంది. అదే రోజు తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తారు. ఆ రోజున రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు  రావాల్సి ఉన్నందున ఇప్పటి వరకూ ఆయన పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. అయితే మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది. ఆ రోజున తెలంగాణ విమోచన దినం కావడంతో అటు బీజేపీ .. ఇటు కాంగ్రెస్ సభలతో హోరెత్తించబోతున్నాయి. గజ్వేల్ నడిబొడ్డున సమరశంఖం పూరించి కేసీఆర్‌కు రాజకీయ సవాల్ పంపాలని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. Also Read : దళిత బంధు కోసం మరో పైలట్ ప్రాజెక్ట్ గ్రామం



సెప్టెంబర్ 17న తెలంగాణ కాంగ్రెస్ నేతలు  వరంగల్‌లో దళిత, గిరిజన దండోరాను నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఆ తేదీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా గజ్వేల్‌కు మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం కావడంతో గజ్వేల్ దళిత, గిరిజన దండోరాను ఓ రేంజ్‌లో సక్సెస్ చేయాలని రేవంత‌్ ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజులుగా గజ్వేల్ కాంగ్రెస్ సభపై వివాదం రేగుతోంది. అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేయడమే దీనికి కారణం. అడ్డుకుంటే తొక్కుకుంటూ వెళ్తామని రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ప్రకటనలు ఇచ్చారు.  ఈ క్రమంలో తెలంగాణ విమోచనా దినోత్సవం రోజునే గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి సభను ఏర్పాటు చేశారు. Also Read : టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?



విజయవంతం చేయడాన్ని సవాల్‌గా తీసుకున్నారు. సభ విజయవంతం కోసం  రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ల సలహాలు, సహకారాన్ని తీసుకుంటున్నారు. పీసీసీ మాజీ చీఫ్‌లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ సహా సీనియర్ నేతలందరితో సమావేశం కావాలని నిర్ణయించారు.  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత అంటీ ముట్టనట్లుగా ఉన్న నేతలను కూడా పిలిచారు. కోమటిరెడ్డికి కూడా ఆహ్వానం వెళ్లినట్లుగా తెలుస్తోంది.  గజ్వేల్ సభకు మల్లిఖార్జున ఖర్గేను ప్రత్యేక ఆహ్వానితునిగా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పలువురు నేతల్ని కూడా పార్టీలో చేర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read : అనుకున్నంతలోనే సీఎంల మార్పు ! బీజేపీలో మోడీ,షాల పట్టుకు నిదర్శనమా..? బలమైన నేతల్ని ఎదగనీయకపోవడం కారణమా...?



రేవంత్ రెడ్డి పార్టీ యూత్ గ్రూపులను యాక్టివ్‌గా ఉంచుతున్నారు.  ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ లాంటి విభాగాల నుంచి కూడా శ్రేణులను గజ్వేల్ సభకు తరలించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ వన్ మ్యాన్ షో చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గజ్వేల్ సభను అనుకున్న స్థాయిలో నిర్వహించగలిగితే.. కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ లభించే అవకాశం ఉంది. ఓ వైపు అమిత్ షా సభ నిర్మల్‌లో జరగనుంది.. మరో వైపు  కేసీఆర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హోరెత్తించనుంది. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కనుంది. Also Read : మన చేప- మన ఆరోగ్యం... ఏపీలో సర్కారు వారి చేపలు...!