Telangana Elections 2023 :  కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కారు దిగి చేయి అందుకొనున్నారు.  గత కొంత కాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.   రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జలగం వెంకట్రావు చేరిక కోసం  కేవీపీ రామచంద్రరావు మంతనాలు జరిపారు.  జలగం వెంకట్రావు 2004లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం సత్తుపల్లి సీటు ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి  2 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


2014లో బీఆర్ఎస్ నుంచి ఖమ్మంలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే 


తర్వాత  టీఆర్ఎస్ లో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  కొత్తగూడెం నుంచి పోటీ చేసిన ఆయన ఒక్కరే విజయం సాధించారు. అయితే.. 2018లో టీఆర్ఎస్ నుంచి మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత  వనమా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో వనమాకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో జలగం అసంతృప్తితో ఉన్నారు.వనమా ఎన్నిక చెల్లదంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికే జలగానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వగా.. వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


మళ్లీ కేసీఆరే సీఎం-భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తాం- ఆక్స్‌ఫర్డ్‌లో తెలంగాణ అభివృద్ధిపై కవిత కీలక ప్రసంగం


గత ఎన్నికల్లో వనమా చేతిలో స్వల్ప తేడాతో ఓటమి              


కాంగ్రెస్ పార్టీ జలగం వెంకట్రావుకు కాంగ్రెస్ కొత్తగూడెం టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. కానీ, పొత్తులు కుదరని పక్షంలో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావును బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఖమ్మంలో బలమైన బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రె్స పార్టీలో చేరిపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు వారి అనుచురులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జలగం కూడా కాంగ్రెస్ లో చేరనుండటంతో ఆ పార్టీకి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. 


కాంగ్రెస్ నుంచి మళ్లీ కొత్త గూడెం అభ్యర్థిగా పోటీ చేసే  అవకాశం           


ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకిపెద్దగా బలం లేదు. 2014తో పాటు 2018లోనూ ఆ పార్టీకి ఒక్కొక్క సీటే లభించింది. అయితే అక్కడ ఇతర పార్టీల నుంచి చేరిన వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరిపోయేవారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ  చేరిన వారికే టిక్కెట్లు ఇస్తోంది. దీంతో  పార్టీ కోసం పని చేసిన వారు అసంతృప్తికి గురవుతున్నారు.