Falaknuma Express Stopped Due To Technical Issue: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో శనివారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం 8 గంటలకు మిర్యాలగూడ స్టేషన్‌కు వచ్చిన రైలులోని ఓ బోగీలో సాంకేతిక సమస్యను అధికారులు గుర్తించారు. బోగీలో వీల్ బ్రేక్ లాక్ కాగా.. రైల్వే గార్డు సమాచారంతో గుంటూరులోని ఇంజినీరింగ్ అధికారుల బృందం వెంటనే అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టింది. అనంతరం రైలు తిరిగి బయలుదేరింది.


కాగా, గతేడాది జులై 7న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 7 బోగీలు దగ్ధమయ్యాయి. భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద రైలులో ఎస్ - 4 బోగీలో మంటలు చెలరేగి వ్యాపించాయి. ఓ ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపాడు. లోకో పైలెట్, ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.


Also Read: Road Accident: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం - వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాల్లో 9 మంది మృతి