Telangana News: రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచే ఆయన ఎన్నికయ్యారు. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియగా.. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అయిన అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం కారణంగా పద్మరాజన్ నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఆయన తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎలక్షన్ ఆఫీసర్ నుంచి సంబంధిత ధ్రువపత్రాన్ని స్వీకరించనున్నారు.
Abhishek Manu Singhvi: రాజ్యసభ ఎంపీగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక
Venkatesh Kandepu
Updated at:
27 Aug 2024 04:50 PM (IST)
Rajya Sabha Election: రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అయిన అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో అభిషేక్ మను సింఘ్వీ