Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును మరోసారిఈడీ ప్రస్తావించింది. ఈ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన కౌంటర్‌లో తెలిపింది. ఈ కేసులో నిందితుడు అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై మంగళవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో ఈడీ తరుపు లాయర్లు ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ జరిగిందని ఈడీ తరుఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఈ స్కామ్‌కు సంబంధించి జరిగిన మీటింగుల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని కౌంటర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులతో కవిత ఫీనిక్స్ అనే కంపెనీ నుండి భూములు కొన్నారని ఈడీ లాయర్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరుణ్ రామచంద్ర పిళ్లైది కీలక పాత్ర అని.. అతడికి బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరుఫు లాయర్లు కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్‌పై తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని పిళ్లై తరుఫు లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు. దీంతో పిళ్లై బెయిల్ పిటిషన్ తదుపరి విచారణను స్పెషల్ కోర్టు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన రెండవ చార్జ్ షీట్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడ లేదు. కవితను ప్రశ్నించినప్పటికీ ఇప్పటిదాకా సీబీఐ ప్రశ్నించిన వారి.. జాబితాలోనూ కవిత పేరు కనిపించలేదు. ఏప్రిల్ 25న అనుబంధ చార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది. సుమారు 5వేల 700 పేజీలతో రెండో ఛార్జ్‌షీట్ వేసింది సీబీఐ. ఆ తర్వాత డిసెంబర్ 11న కవితను హైదరాబాద్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటిదాకా ప్రశ్నించి 89మంది వివరాల్ని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల వైఖరికి.. ఆమె విషయంలో స్పష్టమైన ఆధారాలు లేకనా? మరేదైనా కారణమా అని చర్చ జరుగుతోంది.
మే నాలుగో తేదీన 4వ అనబంధ ఛార్జ్‌షీట్ వేసింది ఈడీ. 270 ప్రధాన పత్రాలు.. సుమారు 2వేల అనుబంధ పేజీలతో.. నాలుగో అదనపు ఛార్జ్‌షీట్ వేసింది ఈడీ. ఈనెల 30న ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై.. ఉత్తర్వులు వెలువరించనుంది ప్రత్యేక కోర్టు. రెండు ఛార్జ్‌షీట్లలోనూ ప్రధానంగా మనీష్ సిసోడియాపైనే.. సీబీఐ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. లిక్కర్ కేస్ దర్యాప్తులో భాగంగా గతంలో కవితను సీబీఐ, ఈడీ ప్రశ్నించాయి. గతంలో మూడుసార్లు కవితను విచారణకు పిలిచి ఈడీ ప్రశ్నించింది. కవిత పేరు పలుసార్లు ప్రస్తావించినప్పటికీ ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలో.. కవిత పేరు లేదంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. నిందితులతో కవిత పలుసార్లు హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవిత బినామీ అని పిళ్లై అని ఈడీ వాదిస్తోంది.