గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ఖరారు అయ్యింది. హీరోగా నట సింహానికి 108వ చిత్రమిది. ఇందులో ఆయన పేరే సినిమాకు పెట్టేశారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday). ఆ రోజు టైటిల్ పోస్టర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. 


'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా (NBK 108 Movie) చేస్తున్నారు బాలకృష్ణ. అందులో భగవంత్ కేసరి (Bhagavanth Kesari) పాత్రలో ఆయన కనిపిస్తారు. సినిమాకు కూడా ఆ టైటిల్ కన్ఫర్మ్ చేశారని తెలిసింది. అదీ సంగతి!


బాలకృష్ణ 108వ సినిమాకు 'భగవంత్ కేసరి' టైటిల్ ఖరారు చేశారని, ఆ విషయాన్ని బాలయ్య బర్త్ డేకు అనౌన్స్ చేస్తారని చిత్ర బృందం సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఆల్రెడీ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నారు. అందులో కొత్త లుక్ కనిపించే అవకాశం ఉంది.  


పవన్ సినిమాకు 'బ్రో' పెట్టేశారు!
తొలుత బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాకు 'బ్రో - ఐ డోంట్ కేర్' టైటిల్ ఖరారు చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే... పవన్ కళ్యాణ్, సాయి తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమాకు ఆ టైటిల్ పెట్టారు. దాంతో బాలకృష్ణ ఇమేజ్, అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి పవర్ ఫుల్ టైటిల్ డిసైడ్ చేశారు. 


బాలకృష్ణ క్యారెక్టర్ పేరే టైటిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో ఘన విజయాలు సాధించనవి ఉన్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 


'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వాళ్ళిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. ఇంతకు ముందు కొన్నిసార్లు ఈ కాంబినేషన్ కొంత మంది దర్శక, నిర్మాతలు పరిశీలనలోకి వచ్చినా సరే... సెట్ కాలేదు. ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీ లీల ఉన్నారు. బాలకృష్ణకు వరుసకు కుమార్తె అయ్యే పాత్రలో ఆమె నటిస్తున్నారు. బాలకృష్ణ సోదరుడిగా శరత్ కుమార్ నటిస్తున్నారు. శ్రీ లీలకు తండ్రి పాత్ర ఆయనది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు.


Also Read : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?  


దసరా బరిలో బాలకృష్ణ సినిమా!
''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.


Also Read ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!



రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.