EC Allows to Give DA to Telangana Employees: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య చర్చలు జరిగాయి. డీఏ చెల్లింపు ఆలస్యమైందని చెప్పగా ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈసీ చెప్పడంతో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ చెల్లించనున్నారు.


గతంలో డీఏల చెల్లింపు విధానంపై ఈసీ ఆరా తీసింది. ఎన్నికల సమయంలో ఇప్పుడెందుకు డీఏ ఇవ్వాలనుకుంటున్నారని సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఈసీకి  విజ్ఞప్తి చేసింది. తాజాగా రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో ఒక డీఏ విడుదల చేయవచ్చునని, అందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలు సైతం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా డీఏ కోసం ఈసీని కోరారు. దాంతో ఎట్టకేలకు ఒక డీఏ విడుదలకు అనుమతి ఇచ్చింది ఈసీ.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply