Trending
Telangana Budget 2025: తెలంగాణలో ఉచిత బస్సు సేవల ఖర్చు ఎంత? ఎంత మంది ఉపయోగించుకున్నారు?
Telangana Budget 2025: డిసెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు 149.63 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సుసౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇలా మహిళలకు అందించే పథకాలు లెక్కలు బయటపెట్టింది ప్రభుత్వం.
Telangana Socio-economic Survey 2025: ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే గత ఏడాది ఎంత మంది ప్రయాణించారు అన్న లెక్కలను సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ -2025 ద్వారా తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రభుత్వం సభలో ఆవివరాలను ప్రవేశపెట్టింది. డిసెంబర్ 2024 నుంచి మార్చి ఆరో తేదీ 2025 నాటికి 149.63 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మొత్తం వీరి ప్రయాణాల విలువ 5005.95 కోట్లు.
సిలిండర్ సబ్సిడీ పథకం అమలు ఎలా ఉందో తెలుసా ?
మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు అందిస్తోన్న మరో పథకం సిలిండర్ సబ్సిడీ. 500 రూపాయలకే సబ్సిడీతో సిలిండర్ ప్రభుత్వం మహిళలకు అందజేస్తోంది. ఈ పథకం అమలు అయింది ఫిబ్రవరి 27 2024లో, అయితే నాటి లబ్ధిదారుల సంఖ్య 39,50,884. అది ఇప్పుడు 43 లక్షల మందికి పెరిగింది. లబ్ధిదారులకు ఇప్పటి దాకా రాయితీ సిలిండర్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం చేసిన ఖర్చు 433.20 కోట్లు.
గృహ జ్యోతి పథకానికి ఎంత ఖర్చు చేశాలో తెలుసా ?
గృహ జ్యోతి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు పేదలకు ఉచితంగా విద్యుత్‌ను ఎలాంటి బిల్లు లేకుండా అందిస్తుంది. తెలంగాణవ్యాప్తంగా 50 లక్షల గృహాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. మార్చి 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 1775 కోట్లు ప్రభుత్వం ఈ గృహజ్యోతి పథకం కోసం ఖర్చు చేసినట్లు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ -2025 లో పేర్కొంది.