Hyderabad To Ayodhya Direct Flight: అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. భాగ్యనగరం నుంచి అయోధ్యకు (Ayodhya) డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం తెలిపారు. అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభించాలని.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాశానని చెప్పారు. దీనిపై స్పందించిన సింధియా.. వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడి విమాన సర్వీసు వచ్చేలా చర్యలు చేపట్టారన్నారు. ఈ విమానం సేవలు ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు (మంగళవారం, గురువారం, శనివారం) అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Hyderabad News: హైదరాబాద్ టూ అయోధ్య డైరెక్ట్ ఫ్లైట్ - ఎప్పటి నుంచి ప్రారంభమంటే?
ABP Desam
Updated at:
31 Mar 2024 08:40 PM (IST)
Ayodhya Flight: అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్