Telangana News : తెలంగాణలో కలిసేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని గ్రామ ప్రజలు ఆసక్తిగా ఉన్నారని ఉద్యమాలు చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అక్కడి ప్రజలు ఉద్యమానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్ర పరిధిలోని ధర్మాబాద్ తాలూకా గ్రామస్తులు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో కలుస్తామంటున్న ధర్మాబాద్ ప్రజలు
మరాఠ్వాడాలొని తెలంగాణకి అతి దగ్గర గా ఉన్న ధర్మాబాద్ తాలూకా గ్రామస్తులు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చెయాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇటీవల మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ దఫా ధర్మాబాద్ కి అతి సమీపంలో ఉన్న తెలంగాణలోని గ్రామస్తులు వారికి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ, మరాఠ్వాడ లొ నివసించే వారు కుటంబ సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఇరు రాష్ట్రాల సంక్షేమ పథకాల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందని, తెలంగాణ వాసుల జీవితాలు సుభీక్షంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలో నివసించే వారి జీవితాలు దారిద్ర్యంలో మగ్గుతున్నాయని వారు వాపోతున్నారు.
తెలంగాణ సర్కార్ పథకాల వల్ల ఎంతో లబ్ది కలుగుతుందని ఆకాంక్ష
తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు రైతు బంధు, రైతు భీమ, 24 గంటల ఉచిత విద్యుత్, దళిత బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, యంత్ర లక్ష్మీ, కెసిఆర్ కిట్, ఓవర్సీస్ విద్యా స్కాలర్ షిప్, ఉచితoగా సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలు తెలంగాణ వాసులకు రావడం, అటువంటి పథకాలు తెలంగాణకు కిలో మీటర్ దూరంలో ఉన్న మహారాష్ట్ర వాసులకు వస్తే బాగుండును అంటున్నారు. మహారాష్ట్ర లోని తమ బంధువులకు ఎటువంటి సంక్షేమ పధకాలు రాకపోవడం చాలా బాధగా ఉందని.... మాహారాష్ట్రా లోని గ్రామస్తులతో పాటు తెలంగాణ గ్రామస్తులు కూడ వాపోతున్నారు.అలాగే కెసిఆర్ స్థాపించిన BRS పార్టీని వారు స్వాగతిస్తామంటున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ నుంచి పోటీ చేస్తామంటున్నారు మహారాష్ట్ర వాసులు.
ప్రభుత్వాలు స్పందించకపోతే ఉద్యమం చేస్తామంటున్న ప్రజలు
ఇప్పటికే తెలంగాణ బార్డర్ లో ఉన్నా 30కి పైగా గ్రామాల ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో కలపాలని సీఎం కేసీఆర్ కు విన్నవించుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు వారు ఆకర్షితులవుతున్నారు. రెండేళ్ల క్రితం తెలంగాణ బార్డర్ లో ఉన్న గ్రామాల ప్రజలు బోధన్ ఎమ్మెల్యే షఖిల్ కు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం వారి గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో విలీనం చేయాలని ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు తమ గ్రామాల శివార్లలో తెలంగాణ రాష్ట్రం అనే బోర్డులు పెట్టేసుకుంటున్నారు. ఈ ఉద్యమం ఎంత దూరం వెళ్తుందో కానీ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారినా ఆశ్చర్యోపవాల్సిన పని లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక ప్రియాంక గాంధీనే సూపర్ పవర్ ! తెలంగాణ కాంగ్రెస్‌లో ఆట మార్చేస్తున్న హైకమాండ్ !