Basara IIIT Agitation :   సమస్యలు పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగాయి. విద్యార్థులు పెట్టిన డిమాండ్లపై మంత్రి సబిత స్పందించారు. ఇంచార్జి వీసీ, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘాల గురించి వారికెందుకని.. వారి ఆందోళనల వెనుక రాజకీయ ప్రోద్భలం ఉందన్నారు. తక్షణం విద్యార్థులు ఆందోళన మానేసి క్లాసులకు వెళ్లాలన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాజకీయ ఆందోళనలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.

  





 


చాలా కాలంగా సమస్యలు తిష్ట వేశామని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని విద్యార్థులు చెబుతున్నారు. ట్రిపుల్ ఐటీ చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులపై మంత్రి కేటీఆర్ కు ఓ స్టూడెంట్ ట్విట్ చేశాడు. ఆ ట్విట్ కు కేటిఆర్ రీప్లే ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించాలని 8 వేల మంది విద్యార్థులం అందరం రోడ్డుపైనే ఉన్నామని స్టూడెంట్ ట్విట్ కు.... సమస్యలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ రీ-ట్విట్ చేశారు. అయితే గతంలోనూ ఇలాగే స్పందించారని అయితే ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


కేటీఆర్ వచ్చి తమతో మాట్లాడి స్పష్టమైన హామీ ఇస్తేనే తమ ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. నిన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన చేపట్టిన విద్యార్థులు బుధవారం ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్, బిజెపి నాయకులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు గా నిలిచారు. కొందరు బిజెపి, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.  బాసర ట్రిపుల్ ఐటీ లో ఉన్న సమస్యలను వెంటనే తీర్చాలని గవర్నర్ తమిళసైని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయo బాపురావు కలిసి వినతిపత్రం ఇచ్చారు. 


బాసర విద్యార్థులు ప్రభుత్వం ముందు పెట్టిన ప్రధాన డిమాండ్స్ ఇవి ! 


1.రెగ్యులర్ వీసి నియామకంలో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
2. ఫ్యాకల్టీ విద్యార్థి నిష్పత్తి
3.ICT( ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఆధారిత విద్య
4. PUC బ్లాక్‌లు మరియు హాస్టళ్ల పునరుద్ధరణ
5. లైబ్రరీలో మరిన్ని బుక్స్ అందుబాటులో ఉండాలి.
6.విద్యార్థులకు అవసరమైన మంచాలు, పడకలు, యూనిఫాoలు అందుబాటులో ఉంచాలి.
7.నిత్యావసరాలైన ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటర్నెట్ మొదలైనవి అందుబాటులో ఉంచాలి.
8.మెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ మెరుగుపర్చాలి.
9. క్యాoటిన్ లో గుత్తాధిపత్యo, టెండర్లను రద్దు చేయాలి.
10. PED & PET నియమించాలి..  ఇతర సంస్థలతో సహకారం అందించాలి.