Telangana Elections 2023 Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది. చాలా రోజుల కిందటే ఆరు గ్యారంటీల్ని ప్రకటించి..విస్తృతం గా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే సమయంలో వివిధ వర్గాలకు డిక్లరేషన్లు ప్రకటించింది. అన్నీ కలిపి తాజాగా మేనిఫెస్టో ప్రకటించనుంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ( Mallikarjoun Kharge ) హైదరాబాద్ వస్తున్నారు. ఆయన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
పేదల పెళ్లిళ్లకు తులం బంగారం హామీ !
కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పేదలకు పెళ్లిళ్లకు సాయం కింద రూ. లక్ష వరకూ నగదు ఇస్తున్నారు. ఆ నగదుతో పాటు ఇక నుంచి తులం బంగారం ( Gold ) ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నారు. అలాగే. చాలా కాలం నంచి ధరణని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణి స్థానంలో భూభారతి అనే విధానాన్ని తెస్తామని.. ధరణిలో ఉన్న లోపాలన్నింటనీ సవరిస్తామని కాంగ్రెస్ పార్ట హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత కల్పించే ఆలోచనచేస్తు్న్నారు.
ఇక రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో తామ మూడో సారి గెలిస్తే సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే హామీ ఇస్తోంది. తెల్ల రేషన్ కార్డు ( White Ration Card ) కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మేనిపెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మొదట్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించుకుంద. ప్రకటనలు, సంచులు కూడా ఆర్డర్ ఇచ్చింది. కానీ సన్నబియ్యం పంపిణీ సాధ్యం కాదని తేలడంతో సన్నబియ్యం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని అప్పటి మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఆ తర్వాత సన్నబియ్యం ప్రస్తావన వైసీపీ తీసుకు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు సన్నబియ్యం హామీ ఇస్తున్నాయి. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ బియ్యం లేకపోవడం వల్ల డబ్బుల ఇస్తోంది.
పేదలకు మేలు చేసే పలు సంక్షేమ పథకాలు
అలాగే.. అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని నిర్ణయించకున్నారు. ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం , వార్డు సభ్యులు గౌరవ వేతనం, ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్ , ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు , జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను పెట్టనున్నట్లుగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కన్నా మెరుగైన హామీైలు ఇవ్వాలని ప్రజల్ని ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ అంటే సంక్షేమ రాజ్యమని మరోసారి నిరూపిస్తామని అంటున్నారు.