Etala Rajendar: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈటల రాజేందర్ పై విరుచుకుపడుతున్నారు. బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం లేదని అక్కసుతో ఆయన రేవంత్ రెడ్డిపై దారుణ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. తాము ఒక్క విజిల్ వేస్తే చాలని  ఈటలకు టీపీసీసీ చీఫ్  మహేష్ కుమార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో చేతకాని, దద్దమ్మ మంత్రులుగా ఉన్న  ఈటల రాజేందకర్‌కు సీఎం రేవంత్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ నుంచి తన్ని తరిమేస్తే బీజేపీలోకి వెళ్లారు..ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్ వైపు ఈటల చూస్తున్నారని అందుకే రేవంత్ రెడ్డిని తిడుతున్నారని మండిపడ్డారు. 

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా ఈటలపై మండిపడ్డారు. తాము తిరిగి తిడితే తట్టుకోలేరని హెచ్చరించారు.  ఈటెల రాజేంద్ర మీరు కమ్యూనిస్టు భావజాలం ఉండి బీజేపీలోకి వెళ్లారని.. బీజేపీలో లెప్ట్‌ వింగ్‌ నుంచి రైట్‌ వింగ్‌కు పోవడం వల్ల మీ మెదడు దొబ్బినట్లు ఉందని చామల కిరణ్ మండిపడ్డారు.  ఏదో అధ్యక్ష పదవి ఇస్తారని...రాష్ట్రాన్ని ఎలగబెట్టి సీఎం అవుదామని పిచ్చి ఆలోచన నడవడం లేదు ..బీజేపీ సీనియర్‌ నాయకులు మిమ్మల్ని ముందుకు  వెళ్లనివ్వడం లేదన్నారు.  మీ సమస్య అంతా బీజేపీ పార్టీలో ఉంది.. సీఎం రేవంత్‌ రెడ్డిని తిడితే పదవులు వస్తాయని భ్రమిస్తున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఎందుకు రేవంత్ రెడ్డిపై ఇలాంటి విమర్శలు చేశారో కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా ఆయనపై ఫైర్ అవుతున్నారు. 

ఎంపీ ఈటల రాజేందర్ నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలి అని జగ్గారెడ్డి  హెచ్చరించారు. . హద్దులు మీరి నువ్వు మాట్లాడావు....అందుకే నేను కూడా హద్దులు దాటి సమాధానం చెప్పాల్సి వస్తోందని ప్రెస్మీట్ పెట్టి హెచ్చరించారు.  ఈటల పాగల్ గాడు అయ్యిండు... అన్నీ బేవకూఫ్ చేష్టలు చేస్తున్నాడని విరుచుకుపడ్డారు.  బీజేపీలో ఆశించిన పదవులు దక్కకపోవడంతో ఈటల రాజేందర్ తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నట్లు జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.‘గంజాయి తాగిన వ్యక్తిలా, ఒక సైకోలా ఎంపీ ఈటల ప్రవర్తిస్తున్నాడు అని మండిపడ్డారు. బీజేపీలో ఆశించిన పదవి రాలేదన్న ఫ్రస్టేషన్‌లోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని.. బూతులు మాట్లాడే వారికి బూతులతోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది అని జగ్గారెడ్డి  హెచ్చరికలు జారీ చేశారు.    

అసుల ఈటల ఏమన్నారంటే ? 

‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్, సైకో. ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంలోనే ఆయన ఆనందం పొందుతున్నారు అని ఈటల రాజేందర్ విమర్శుల చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం నడుస్తోంది. ప్రజల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.  బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్‌కు హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం ఏమిటని ఈటల ప్రశఅనించారు.  రేవంత్ తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారని.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వ్యవస్థను సరిదిద్దుకోవాలని సూచించారు.  ప్రజల జీవితాలతో చెలగాటమాడేవారు ఎవరూ బాగుపడరు అని హెచ్చరించారు.