Pradeep Ranganathan Dude Movie Title Controversy: 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీస్‌తో విజయం అందుకున్నారు ప్రదీప్ రంగనాథన్. అదే జోష్‌తో మరో కొత్త మూవీ 'డ్యూడ్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా ఇటీవలే పోస్టర్ రిలీజ్ చేశారు.
'డ్యూడ్' టైటిల్ నాదే
అయితే.. ఇప్పుడు 'డ్యూడ్' టైటిల్‌పై వివాదం నెలకొంది. ఈ మూవీ టైటిల్ తమదేనని.. ఏడాది కిందటే దీన్ని రిజిస్టర్ చేశామని యంగ్ హీరో, దర్శకుడు తేజ్ తెలిపారు. ప్రదీప్ - మైత్రీ మూవీ మేకర్స్ కాంబో మూవీకి ఈ పేరు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. ఏడాదిగా 'డ్యూడ్' సినిమా ప్రమోషన్లు చేస్తున్నామని అన్నారు.
ఘర్షణ పడే ఉద్దేశం లేదు
మైత్రీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థతో గొడవ పడే ఉద్దేశం తమకు లేదని తేజ్ చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే సదరు సంస్థ దృష్టికి తీసుకెళ్లామని.. వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరి దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
తేజ్ హీరోగా చేస్తూనే 'డ్యూడ్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబరులో మూవీని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ 'సింగిల్' - 3 రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ప్రదీప్ 'డ్యూడ్' మూవీ గురించి..
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ 'డ్యూడ్' (Dude) మూవీని నిర్మిస్తున్నారు. ఈ దీపావళికి రిలీజ్ చేయనుండగా.. ఇటీవలే పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో తాళితో పిడికిలి బిగించి మాస్ లుక్‌లో ప్రదీప్ అదరగొట్టారు. డిఫరెంట్ లుక్‌లో పోస్టర్ చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీతోనే కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ప్రేమలు బ్యూటీ మమిత బైజు.. ప్రదీప్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రోహణి మొల్లేటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించనుండగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ రానున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఫిక్స్
'డ్యూడ్' మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాక ముందే ఓటీటీ పార్ట్‌నర్ సైతం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.