MLA Maganti Gopinath health condition : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం నెలకొంది. ఆయన చనిపోయారని వైద్యులు నిర్దారించినట్లుగా కొంత మంది బీఆర్ఎస్ నేతలు మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే అధికారికంగా ధృవీకరించలేదు. ఆయనకు ఇంకా చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వద్దకు వచ్చిన హరీష్ రావు మీడియాకు చెప్పారు. ఆయన చనిపోలేదని అంటున్నారు. వైద్యులు మాగంటి గోపీనాథ్ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.