Suriya Visits Palani Temple: తమిళ స్టార్ సూర్య పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ గురువారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం, పూజల తర్వాత తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
త్వరలోనే కొత్త మూవీ షూటింగ్
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయన డైరెక్ట్‌గా తెలుగులో నటిస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే. ఇటీవల కెరీర్ పరంగా సూర్య ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఆయన లేటెస్ట్ మూవీస్ 'కంగువా', 'రెట్రో' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. తమిళంలో 'రెట్రో' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని సూర్య భావిస్తున్నారు.
'లక్కీ భాస్కర్' తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మూవీ ప్రారంభమైంది. ఈ మూవీ సూర్య కెరీర్‌లో 46వ చిత్రం. సూర్య సరసన ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు రవినా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 9 నుంచి మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'థగ్ లైఫ్' రివ్యూ: కమల్‌ను శింబు డామినేట్ చేశారా? 'నాయకుడు'ను మర్చిపోయేలా మణిరత్నం సినిమా ఉందా?
మూవీ షూటింగ్ ప్రారంభానికి ముందు చిత్ర బృందం పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మూవీ టీంకు నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
డిఫరెంట్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి భారీ హిట్లతో మంచి జోష్‌లో ఉన్న వెంకీ అట్లూరి ఈ మూవీతో మరో భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమా కోసం సూర్యకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక తమిళంతో పాటు తెలుగులోనూ హీరో సూర్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన డైరెక్ట్‌గా తెలుగులో మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తుండగా ఇప్పటికి నెరవేరింది. ఇది మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.