Telangana Cisco: తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి

Telangana: తెలంగాణలో స్కిల్ యూనివర్శిటీకి సహకరించేందుకు సిస్కో ఒప్పందం చేసుకుంది. ఈ సమావేశం సమయంలో ఇప్పాల రవీంద్రారెడ్డి కనిపించలేదు.

Continues below advertisement

Cisco Telangana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చోసుకున్నట్లే తెలంగాణ ప్రభుత్వంతో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ సిస్కో ఒప్పందం చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండటంతో  సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ కారణంగా సిస్కో బృందం సీఎం రేవంత్ ను అసెంబ్లీ కమిటీ హాల్లోనే కలిసింది.  ఆయన సమక్షంలో అధికారులు సంతకాలు చేసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో  CISCO, TASK ఒప్పందం చేసుకున్నాయి. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Continues below advertisement

అయితే సిస్కో ఉన్నత ఉద్యోగి అయిన ఇప్పాల రవీంద్రారెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన గురించి పూర్తి సమాచారం వెల్లడి కావడంతో ఆయనను సీఎం రేవంత్ తో కలిసే టీం నుంచి తప్పించినట్లుగా భావిస్తున్నారు.  మంగళవారం ఏపీ ప్రభుత్వంతో  సిస్కో ఒప్పందం చేసుకుంది. నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సిస్కో సౌత్ ఇండియా టెరిటరీ అకౌంట్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల రవీంద్ర కూడా సమావేశానికి హాజరయ్యారు. లోకేష్ తో కలిసి ఫోటోలు దిగారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గగ్గోలు రేగింది.  

కానీ ఆయనే ఇప్పాల రవీంద్ర అని వీడియోలు రిలీజ్ అయ్యే వరకూ అధికార వర్గాల్లో ఎవరికీ తెలియదని అంటున్నారు. తెలిసిన తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి.  సిస్కోలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత చీప్ గా సోషల్ మీడియా పోస్టులు పెడతారా అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన గురించి సిస్కో టీమ్ కు సమాచారం ఇచ్చారు. మరోసారి ఎపీకి సంబందించిన ఎలాంటి విషయాల్లోనూ ఆయనను ఇన్వాల్వ్ చేయవద్దని స్పష్టం చేశారు.  ఇప్పాల రవీంద్రారెడ్డి 2017లో సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయ్యారు.  

లోకేష్‌తో సమావేశం తర్వాత పెద్ద ఎత్తున ఇప్పాల రవీంద్రారెడ్డి గురించి మీడియాలో..సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో కంపెనీకి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో  ఆయనను రేవంత్త తో సమావేశానికి దూరంగా ఉంచినట్లుగా భావిస్తున్నారు.  రేవంత్ తో జరిగిన సమావేశాల్లో ఆయన  కనిపించలేదు.                      

Continues below advertisement
Sponsored Links by Taboola