Ammayi garu Serial Today Episode 
రాఘవ మాయమవ్వడంతో రాజు,రూప కంగారుపడిపోతారు. రాఘవ వస్తున్నట్లు ఎవరికైనా చెప్పారా అడగ్గా...నేను మా అమ్మకు తప్ప ఎవరిక చెప్పలేదని చెబుతుంది.మరి రాఘవను ఎవరు కిడ్నాప్ చేశారని మదనపడిపోతుంటారు. అటు విరూపాక్షి కూడా బాధపడిపోతుంది. ఇక్కడి వరకు వచ్చిన రాఘవ..సూర్యను కలవకుండా మాయం అవ్వడంపై ఆమె చాలా ఫీల్ అవుతుంది. జీవన్ రాఘవను బలంతంగా  తన మనుషులతో  వేరోచోటకి పంపించడాన్ని దీపక్‌,విజయాంబిక గమనిస్తారు.. జీవన్ చేసిన పనికి మెచ్చుకుంటారు. నువ్వు ఒక్కనిమిషం  లేట్‌ చేసినట్లయితే...ఆ రాజు రాఘవను సూర్యా ముందు నిలబెట్టే వారని చెబుతారు.
 
రాఘవ నిజం మొత్తం చెప్పగానే...మా తమ్ముడు మా ఇద్దరినీ ముక్కలుగా నరికి పారేసేవాడని అంటుంది. ఆ మందారం దెబ్బకే  సూర్య మమ్మల్ని చంపేసినంత పనిచేశాడని..ఇప్పుడు రాఘవ నోరు తెరిస్తే నిజంగానే చంపేశేవాడని  దీపక్ భయపడుతూ చెబుతాడు. నువ్వే మాపాలిట దేవుడివి అని అనగా....మిమ్మల్నికాపాడింది ఈ దేవుడు కాదని ఆ దేవత అంటూ సీఎం పీఏ మాధవిని చూపిస్తాడు. మాధవిని చూసి అమ్మా కొడుకు ఇద్దరూ షాక్‌కు గురవుతారు. ఇక్కడి విషయాలన్నీ సూర్యాకు చెప్పేస్తుందని భయపడతారు. దీంతో జీవన్ వారిని సముదాయిస్తాడు. ఆమె గవర్నమెంట్ అపాయింట్‌మెంట్ చేసిన మాధవి కాదని...తన మనిషి రాధిక అని చెబుతాడు.  ఆ ఇంట్లో మీరు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారనే రాధికను పంపానని జీవన్ చెబుతాడు. రాజు రూపకు చెప్పిన విషయం విని మొత్తం నాకు చెప్పేసిందని నేను వెంటనే అప్రమత్తమయ్యానని చెబుతాడు. సభ వద్దకు వచ్చి రాఘవను కిడ్నాప్ చేసి తీసుకెళ్లామని చెబుతాడు.
 
                    సభ ముగించుకుని సీఎం వెళ్లిపోతుండగా ఓ ప్రేమ జంట అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తుంది. తాము జీవితంలో సెటిలయ్యాక పెళ్లి చేస్తామని మాటిచ్చి ఇప్పుడు వాళ్లు చూపింంచిన వాళ్లే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ప్రేమికులు చెబుతారు. మీరే ఎలాగైనా మా పెళ్లి చేయాలని ప్రాధేయపడతారు. మీతల్లిదండ్రులతో మాట్లాడి మీ పెళ్లి చేయిస్తాని సీఎం వారికి హామీ ఇస్తాడు. అప్పటి వరకు మీరు రక్షణ కల్పిస్తానని చెబుతాడు. ఈలోగా ఆ తాగుబోతోడు మళ్లీ అక్కడికి వస్తాడు. ఇంట్లో ఉన్న ప్రేమికులకే న్యాయం చేయలేని వాడు మీకు ఏం న్యాయం చేస్తాడని నిలదీస్తాడు. సీఎంకు ప్రేమ, పెళ్లి విలువలు అసలు తెలియదని అంటాడు. ఈ తాగుబోతోడు ఏదేదో వాగుతున్నాడని దీపక్‌, వాళ్ల అమ్మ మదనపడిపోతారు. ఇప్పుడు రాజు,గోపి ప్రేమను సూర్య అంగీకరిస్తాడేమోనని భయపడిపోతారు. అతను అడిగింది కూడా న్యాయం ఉందని విరూపాక్షి నిలదీస్తుంది. రాజు, రూప ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోయావని అడుగుతుంది. నీకు రాజు అన్నా, నీ కూతురు రూప అన్నా ఇష్టమే కదా ఎందుకు మరి వాళ్లిద్దరినీ ఒక్కటీ చేయలేకపోయామని నిలదీస్తుంది. పింకీ,గోపీ విషయంలో రాజు నీకు అండగా నిలబడలేదనే కదా ఇదంతా  చేశావని అడుగుతుంది. ఇప్పుడు ఈ ప్రేమికులకు న్యాయం చేయాలని నువ్వు అనుకున్నట్లే  ఆ రోజు రాజు అనుకున్నాడు.అప్పుడు రాజు చేసింది తప్పు అయితే...ఇప్పుడు నువ్వు చేసేది కూడా తప్పే అంటుంది. దీంతో  రాజును  ఇంటికి రమ్మనమంటూ  సూర్యా  చంద్రకు చెబుతాడు.
 
                   దీంతోరాజు విరూపాక్షకు కృతజ్ఞతలు చెబుతాడు. మీ భార్యాభర్తలను కలుపుదామనుకుంటే...మీ రు మమ్మల్ని కలిపారు అంటాడు. ఎప్పుడు ఏం చేయాలో ఆ దేవుడికి తెలుసంటూ ఆమె సమాధానమిస్తుంది. ఇప్పుడు మా ఇద్దరు కన్నా  మీరు కలవడమే ముఖ్యమంటుంది. బంటి గురించి సూర్యకు నిజం చెప్పమని చెప్పగా....అలా చేస్తే రాఘవ  ప్రాణాలకే ప్రమాదమని రూప చెబుతుంది. రాఘవను కూడా మళ్లీ జీవన్‌ కిడ్నాప్ చేసి ఉంటాడని రాజు అనుమానిస్తాడు. రూప కూడా తల్లిని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. దీనికి విరూపాక్షి సరేనంటుంది. మళ్లీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తాడేమోనని  రాజు అనగా...ఏదో ఫైల్‌ పట్టుకుని సీఎంను కలవడానికి ఎమ్మెల్యే వచ్చినట్లుగా వస్తానంటాడు. రాజు,రూప ఇద్దరూ కలిసి సూర్యా ఇంటికి రావడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.