Chilkur Priest: ఉక్రెయిన్(Ukraine) అమ్మాయి, హైదరాబాద్(Hyderabad) అబ్బాయి ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉక్రెయిన్ లోనే వీరి వివాహం జరిగింది. వీరి వివాహ సమయానికి ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధ వాతావణం అంతగా లేదు. వీరు వివాహం(Marriage) చేసుకుని భారత్(Bharat) లో తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చారు. ఇక్కడకు వచ్చిన మరుసటి రోజే ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్ లో ప్రజలు భూగర్భ మెట్రో స్టేషన్ల(Metro Stations)లో తలదాచుకుంటున్నారు. దేశం విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ లో భారతీయులను దేశానికి తరలిచేందుకు కేంద్రం ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారందరినీ దేశానికి సురక్షితంగా తీసుకొస్తామని ప్రకటించింది.
ఉక్రెయిన్ అమ్మాయి-హైదరాబాద్ అబ్బాయి
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం త్వరగా ముగిసిపోవాలని చిలుకూరు బాలాజీ ఆలయం(Chilukuri Balaji Temple) పూజారి సీఎస్ రంగరాజన్ కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు పలికి శాంతిని నెలకొల్పాలని కోరుతూ చిలుకూరు పూజారి, లార్డ్ బాలాజీ టెంపుల్ లో భక్తులతో 16వ శతాబ్దానికి చెందిన వెంకటేశ్వర మందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా రక్తపాతం, అల్లకల్లోలం సృష్టించిందన్నారు. కోవిడ్ సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని ఈ యుద్ధం మరింత ప్రభావితం చేసిందన్నారు. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్(Marriage Reception)లో పాల్గొన్న ఆయన యువ జంటను ఆశీర్వదించారు. ఉక్రెయిన్‌కు చెందిన యువతిని హైదరాబాద్ కు చెందిన యువకుడు వివాహం చేసుకున్నాడు. పెళ్లికొడుకు ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో రంగరాజన్ స్వామి అల్యూమినస్‌గా పనిచేస్తున్న మల్లికార్జునరావు కుమారుడు.
యుద్ధం త్వరగా ముగిసిపోవాలి: చిలుకూరి బాలాజీ పూజారి
పూజారి నవ దంపతులను ఆశీర్వదించడాన్ని వరుడి తల్లిదండ్రులు మల్లికార్జునరావు, పద్మజ చాలా సంతోషించారు. కొత్తగా పెళ్లయిన జంట ప్రతీక్ మరియు లియుబోవ్ ఉక్రెయిన్‌లో వివాహం చేసుకున్నారు. వారు హైదరాబాద్‌లో దిగిన మరుసటి రోజే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం(War) ప్రకటించింది. వీరు రిసెప్షన్‌ను నిర్వహించడానికి భారతదేశానికి వచ్చారు. చిలుకూరు బాలాజీ భక్తులు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ అనవసరమైన యుద్ధం త్వరగా ముగియాలని, మానవ బాధలు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నారని పూజారి అన్నారు.
Also Read: Russia Ukraine War: 'పుష్ప' స్టైల్‌లో పుతిన్‌కు కేఏ పాల్ వార్నింగ్! పాల్ ఫైట్, RGV ట్వీట్!