Chikoti Jions BJP : కేసినో కింగ్ గా పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. . డికె అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. దేశవిదేశాలలో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోలను నిర్వహించినందుకు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ ప్రవేశాన్ని బిజెపి నాయకులలో ఒక వర్గం వ్యతిరేకించింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఫలించలేదు. చివరికి డీకే అరుణ సమక్షంలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
హైకమాండ్ సూచనలతో చీకోటి ప్రవీణ్‌కు బీజేపీ కండువా
చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఓ ఒక క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చీకోటి బీజేపీలో చేరాలనుకున్నారు. ఇందుకు బీజేపీ ఆఫీస్‌కు తన అనుచరులతో వెళ్తే పార్టీలో చేర్చుకునేందుకు నేతలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.తాజాగా చికోటి ప్రవీణ్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యంతో చీకోటికి లైన్ క్లియర్ అయ్యింది. ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్రనాయకత్వానికి హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లుగాచెబుతున్నారు.
చీకోటి ప్రవీణ్‌పై పలు రకాల ఈడీ కేసులు
చీకోటి ప్రవీణ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ఆయనను పలుమార్లు ప్రశ్నించింది. బ్యాంకాక్‌లోనూ ఆయన ఓ సారి క్యాసినో నిర్వహిస్తూ అక్కడి పోలీసులకు పట్టుపడ్డారు. ఈ అంశం సంచలనం అయింది. ఏపీలో వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటారని చెబుతూంటారు. గుడివాడలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కేసినో రాజకీయంగా తీవ్ర దుమారాన్నిరేపింది. ఈడీ కేసుల కారణంగా ఆయనను పార్టీలో చేర్చుకుంటే సమస్యలు వస్తాయని రాష్ట్ర నాయకత్వం- భావిస్తూ వచ్చింది. అందుకే చేరికల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్న చీకోటి ప్రవీణ్.. తనకు సన్నిహితులైన వారితో బీజేపీ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చి మరీ ఆ పార్టీలో చేరిపోయారు.
ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి పోటీ చేయడానికి అభ్యర్థుల కొరత ఉంది. చీకోటి లాంటి ఆర్థిక స్థోమత ఉన్న వారు పార్టీకి అవసరం అని.. అందుకే ఆయనను చేర్చుకున్నారని చెబుతున్నారు. పోటీకి సైతం చీకోటి ప్రవీణ్ రెడీగా ఉన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.