Telangana Liberation Day : టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ మరో ప్లాన్ వేసింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక, హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శితో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష చేశారు.  


కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 


కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో పరేడ్‌ ఉంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులు ఏక్ నాథ్ షిండే, బసవరాజ్ బొమ్మై కూడా పాల్గొంటారని సమాచారం. మహారాష్ట్ర, కర్నాటకతో తెలంగాణ విమోచనానికి సంబంధం ఉండటంతో ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.  నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో కేంద్రం ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. నిజాం నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తైన  సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.  దీనిపై శనివారం జరిగే కేబినెట్ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. 


ప్రతిపక్షాల అస్త్రం 


తెలంగాణ ఏర్పాడినప్పటి నుంచి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. దీనిపై ప్రతిపక్షాల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మజ్లీస్ కు భయపడి టీఆర్ఎస్ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని ప్రతిపక్షాలు ముఖ్యమంగా బీజేపీ విమర్శలు చేస్తుంది. దిల్లీ నుంచి బీజేపీ పెద్దలు తెలంగాణ వచ్చినప్పుడల్లా విమోచన అంశం టచ్ చేయకుండా ఉండరు. దీంతో టీఆర్ఎస్ రివర్స్ ఎటాక్ కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణ విమోజన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణలో పోటీపోటీ 


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించింది. జూన్ లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా ఉండటంతో ఆయన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో వేడుకలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ నిర్వహించేది. ఇటీవల కేంద్రం కూడా ఈ వేడుకలు నిర్వహించింది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణ త్యాగం చేసిన యువతను 'అన్ సంగ్ హీరోస్' పేరుతో ప్రస్తావించడం మొదలు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ కట్టడాల గొప్పదనం, నిర్మాణ శైలి తదితరాలన్నింటినీ ఈ వేడుకల్లో ప్రస్తావించారు. 


Also Read : jagtial News : మలుపులు తిరుగుతున్న జగిత్యాల రాజకీయం - అభ్యర్థులెవరు ?


Also Read : Minister KTR : తెలంగాణపై వివక్షతో దేశప్రయోజనాలు తాకట్టు -మంత్రి కేటీఆర్