తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంపై నిరసనల పర్వం కొనసాగుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని తెలిపింది. ఈ సీజన్‌లో ఇప్పటికే 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించింది. గతంలో మరో 44.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని వివరించింది. ఇప్పటి వరకూ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసినప్పటికీ, ఇకపై కొనుగోలు చేయలేమని స్పష్టం చేసింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించిందని ప్రకటించింది. పంజాబ్‌లో వరి వినియోగం అంతగా ఉండదని అందుకే 90 శాతం ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టం చేసింది. దేశ అవసరాలకు మించి వరి, గోధుమ సాగు అవుతోందని కేంద్రం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో పంట మార్పిడి అనివార్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. 


Also Read: NIA Attacks : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ మూకుమ్మడి సోదాలు.. మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ !


టీఆర్ఎస్ మహాధర్నా
వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టం ఇవ్వాలని హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహా ధర్నా చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ నిరసనలో పాల్గొన్నారు. వేదికపై కూర్చొని ప్రకార్డులు ప్రదర్శిస్తూ వడ్లు కొనబోమన్న కేంద్ర నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 


Also Read: ఈ యుద్ధం ఆరంభమే.. అంతం కాదు, ఇక ఉప్పెనలాగా.. అవసరమైతే వాళ్లనీ కలుపుకుపోతాం: కేసీఆర్


ఇది ఆరంభం మాత్రమే: సీఎం కేసీఆర్
ధర్నాలో పాల్గొ్న్న సీఎం కేసీఆర్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం చేస్తామన్నారు. ఈ పోరాటం ప్రారంభం మాత్రమేనని.. ఇది ఇప్పటితో ఆగదని స్పష్టం చేశారు. గ్రామాల్లోనూ పోరాటాలు చేస్తామన్నారు. అవసరమైతే ఉత్తర భారతంలో నిరసన చేస్తున్న రైతులను కూడా కలుపుకొని పోతామన్నారు. వ్యవసాయ మంత్రి రైతుల సమస్యలపై ఎన్నోసార్లు కేంద్రమంత్రిని కలిసి విన్నవించారని గుర్తుచేశారు. ప్రధాని లేఖ రాసినా ఎలాంటి సమాధానం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకూ నిరసన కొనసాగుతుందని కేసీఆర్ అన్నారు. ప్రధానిని చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా.. వడ్లు కొంటారా? కొనరా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ధాన్యం కొంటామని ఇప్పటి వరకు కేంద్రం హామీ ఇవ్వలేదన్నారు. యాసంగిలో ధాన్యం వద్దని చెబితే వేయాలని బీజేపీ అంటోందని, కేంద్రం ధాన్యం తీసుకోకపోతే దిష్టితీసి బీజేపీ కార్యాలయంపై కుమ్మరిస్తామన్నారు. దేశ రైతుల సమస్యల పరిష్కారం కోసం నేతృత్వం వహిస్తామన్నారు. రాష్ట్ర సాధనలో పదవులను తృణప్రాయంగా వదులుకున్నామని గుర్తుచేశారు. 


Also Read: కేంద్ర ప్రభుత్వాన్ని సాఫ్ సీదా అడుగుతున్నం.. వడ్లు కొంటరా? కొనరా?.. కేసీఆర్ సూటి ప్రశ్న


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి