Rs Praveen Phone Tapping :  తెలంగాణ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ ఆరోపణలు చేశారు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.  తన ఐ ఫోన్‌ను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. తన ఫోన్ హ్యాక్ అవుతోందంటూ.. యాపిల్ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని తెలిపారు. ఆ మెయిల్‌ను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 



ప్రభుత్వ సంస్థలు హ్యాక్ చేస్తున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్‌కు యాపిల్ నుంచి సమాచారం


ప్రభుత్వ సహకారం లేకుండా ఐ ఫోన్లను హ్యాక్ చేయలేరని యాపిల్ సంస్థ వెల్లడించిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు.  ‘మీలా నా ఐ ఫోన్ ను ధ్వంసం చేయను. జాగ్రత్తగా ఉండమని నన్ను యాపిల్ కంపెనీ హెచ్చరించింది. కానీ, మీ దోపిడీ, చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా’ అని ట్విట్టర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 


సెక్యూరిటీ బ్రీచ్ జరిగితే...  ప్రైవసీ పాలసీకి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే హెచ్చరికలు జారీ చేసే యాపిల్ 


ఇప్పటికే చాలామంది ఐ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు యాపిల్ కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ హెచ్చరించిన వారిలో ప్రముఖ జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు చేసింది. తమ ఫోన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులు ఆరోపించారు. అందరూ ఐ ఫోన్లే వాడాలని బండి సంజయ్ కూడా పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు ఐ ఫోన్లు కూడా హ్యాక్ అవుతున్నట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ ద్వారా స్పష్టమవుతోంది. 


ఇటీవల అందరూ  యాపిల్ ఫోన్లు కొనుక్కోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చిన బండి సంజయ్ 


 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ పై   చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కొంత కాలం నుంచి ఈ తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. పెగాసస్ స్పైవేర్ ద్వారా కొంత మందిపై నిఘా పెట్టినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ సర్కార్ పై ప్రవీణ్ కుమార్ చేస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయి.  ఈ అంశంపై బీజేపీ నేతలు ఇంకా స్పందించాల్సి ఉంది. 


భైరి నరేష్ బండి సంజయ్ కలిశారా ? ఈ ప్రచారం వెనుక అసలేం జరిగింది ?