తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభర్థుల మూడో జాబితాను బీఎస్పీ విడుదల చేసింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మరో 25 మందితో కూడిన మూడో జాబితాను రిలీజ్ చేశారు. ఇది వరకే ప్రకటించిన రాజేంద్రనగర్ అభ్యర్థిని మార్చారు. తొలుత ప్రొ.అన్వర్ ఖాన్ కు ప్రకటించగా, ఇప్పుడు రాచమల్లు జయసింహకు కేటాయించారు. అన్వర్ కు అంబర్ పేట్ టికెట్ కేటాయించారు. మొత్తం 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో 31 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. తొలి జాబితాలో 20 మంది, రెండో జాబితాలో 43 మందికి అవకాశం కల్పించారు.


అభ్యర్థులు వీరే



  • మహేశ్వరం - కొత్త మనోహర్ రెడ్డి

  • చెన్నూర్ (ఎస్సీ) - దాసారపు శ్రీనివాస్

  • ఆదిలాబాద్ - ఉయక ఇందిరా

  • ఆర్మూర్ - గండిగోట రాజన్న

  • నిజామాబాద్ (రూరల్) - మటమాల శేఖర్

  • బాల్కొండ - పల్లికొండ నర్సయ్య

  • కరీంనగర్ - నల్లాల శ్రీనివాస్

  • హుస్నాబాద్ - పెద్దోళ్ల శ్రీనివాస్

  • నర్సాపూర్ - కుతాడి నర్సింహులు

  • సంగారెడ్డి - పల్సనూరి శేఖర్

  • మేడ్చల్ - విజయరాజు

  • కుత్బుల్లాపూర్ - లమ్రా అహ్మద్

  • ఎల్బీ నగర్ - గువ్వ సాయిరామకృష్ణ

  • రాజేంద్రనగర్ - రాచమల్లు జయసింహ (రివైజ్డ్)

  • అంబర్ పేట్ - ప్రొ.అన్వర్ ఖాన్ (రివైజ్డ్)

  • కార్వాన్ - ఆలేపు అంజయ్య

  • గోషామహల్ - మహ్మద్ ఖైరుద్దీన్ అహ్మద్

  • నారాయణ్ పేట్ - బొడిగెల శ్రీనివాస్

  • జడ్చర్ల - శివ పుల్కుందఖర్

  • అలంపూర్ (ఎస్సీ) - మాకుల చెన్నకేశవరావు

  • పరకాల - అముదాలపల్లి నరేశ్ గౌడ్

  • భూపాలపల్లి - జితేందర్ యాదవ్

  • ఖమ్మం - అయితగాని శ్రీనివాస్ గౌడ్

  • సత్తుపల్లి (ఎస్సీ) - నీలం వెంకటేశ్వరరావు

  • నారాయణ్ ఖేడ్ - మహ్మద్ అలా ఉద్దీన్ పటేల్


బీఆర్ఎస్, కాంగ్రెస్బీజేపీతో పాటు బీఎస్పీ కూడా ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీలోకి దిగేందుకు సిద్దమైంది. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే 2 జాబితాలను రిలీజ్ చేశారు. సిర్పూర్ నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నారు. తెలంగాణ బీఎస్పీ సీఎం అభ్యర్ధిగా ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును బీఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. ఐపీఎస్‌కు స్వచ్చంధ పదవీ విరమణ చేసిన ఆయన, ఆ తర్వాత బీఎస్పీలో చేరారు. ఆయన్ను తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడిగా మాయావతి నియమించారు.


అన్ని జిల్లాల్లో పర్యటన


గత రెండేళ్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ. ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పిస్తున్నారు. అలాగే కేసీఆర్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తప్పుబడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో విమర్శల వేడిని మరింత పెంచుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే ఆర్‌ఎస్పీ.. ప్రజా సమస్యలపై ట్వీట్లు పెడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ ఉంటారు. అలాగే రాష్ట్రంలో బీఎస్పీని సమర్థవంతంగా నడిపిస్తున్నారు.


తొలి జాబితా


తొలి జాబితాలో నాగర్ కర్నూల్ నుంచి కొత్తపల్లి కుమార్, అందోల్ నుంచి ముప్పారపు ప్రకాష్, కోదాడ నుంచి పిల్లిట్ల శ్రీనివాస్, వనపర్తి నుంచి నాగమోని చెన్న రాముడు, నకిరేకల్ నుంచి మేడి ప్రియదర్విని, ధర్మపురి నుంచి నక్క విజయ్ కుమార్, వైరా నుంచి బానోత్ రాంబాబు నాయక్, మానకొండూరు నుంచి నిషాని రామంచందర్, జహీరాబాద్ నుంచి జంగం గోపీ, పాలేరు నుంచి అల్లిక వెంకటేశ్వర్ రావు, చొప్పదండి నుంచి కొంకటి శేఖర్, పెద్దపల్లి నుంచి దాసరి ఉష, దేవరకొండ నుంచి ముడావత్ వెంకటేష్ చౌహాన్‌లకు సీటు దక్కింది. అటు కొత్తగూడెం నుంచి ఎర్ర కామేష్, సూర్యాపేట నుంచి వట్టే జానయ్య యాదవ్, ఖానాపూర్ నుంచి బాన్సీలాల్ రాథోడ్, అందోల్ నుంచి ముప్పారపు ప్రకాష్, వికారాబాద్ నుంచి గోర్లకాడి క్రాంతి కుమార్, జుక్కల్ నంచి మాధవరావులకు తొలి జాబితాలో అవకాశం దక్కింది. 


43 మందితో రెండో జాబితా


బీఎస్పీ తన రెండో జాబితాలో 43 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించింది. 26 మంది బీసీలు, ఏడుగురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలకు సీట్లు కేటాయించింది. కాగా, రెండో జాబితాలో కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ ఈస్ట్ స్థానంలో పుష్పిత లయ అనే ట్రాన్స్‌జెండర్‌ను బీఎస్పీ బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా పుష్పిత రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. 


రెండో జాబితా అభ్యర్థులు వీరే



  • బెల్లంపల్లి(ఎస్సీ) - జాడీ నర్సయ్య

  • ఆసిఫాబాద్ (ఎస్టీ) - కనక ప్రభాకర్

  • మంచిర్యాల - తోట శ్రీనివాస్

  • బోథ్ (ఎస్టీ) - మెస్రాం జంగుబాపు

  • కోరుట్ల - నిశాంత్ కార్తీకేయ గౌడ్

  • కామారెడ్డి - ఉడతావర్ సురేష్ గౌడ్

  • సిరిసిల్ల - పిట్టల భూమేష్ ముదిరాజ్

  • వేములవాడ - గోలి మోహన్

  • జగిత్యాల - బల్కం మల్లేష్ యాదవ్

  • రామగుండం - అంబటి నరేష్ యాదవ్

  • హుజూరాబాద్ - పల్లె ప్రశాంత్ గౌడ్

  • దుబ్బాక - సల్కం మల్లేష్ యాదవ్

  • మహుబూబ్‌నగర్ - బోయ స్వప్న శ్రీనివాసులు

  • కొడంగల్ - కురువ నర్మద కిష్టప్ప

  • దేవరకద్ర - బసిరెడ్డి సంతోష్ రెడ్డి

  • అచ్చంపేట (ఎస్సీ) - మెత్కూరి నాగార్జున

  • మక్తల్ - వర్కటన్ జగన్నాధ్ రెడ్డి

  • కల్వకుర్తి - కొమ్ము శ్రీనివాస్ యాదవ్

  • కొల్లాపూర్ - గగనం శేఖరయ్య

  • షాద్ నగర్ - పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

  • హుజూర్‌నగర్ - రాపోలు నవీన్

  • మునుగోడు - అందోజు శంకరాచారి

  • వరంగల్ ఈస్ట్ - చిత్రపు పుష్పతలయ

  • మహబూబాబాద్ - గుగులోత్ శంకర్ నాయక్

  • పాలకుర్తి - సింగారం రవీంద్రగుప్త

  • స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) - తాళ్లపల్లి వెంకటస్వామి

  • నర్సంపేట - డా.గుండాల మధన్ కుమార్

  • వర్దన్నపేట (ఎస్సీ) - డా.వడ్డేపల్లి విజయ్ కుమార్

  • డోర్నకల్ (ఎస్టీ) - గుగూలోత్ పార్వతీనాయక్

  • ములుగు (ఎస్టీ) - భూక్యా జంపన్న నాయక్

  • భద్రాచలం (ఎస్టీ) - ఇర్పా రవి

  • పినపాక (ఎస్టీ) - వజ్జ శ్యామ్

  • అశ్వారావుపేట్ (ఎస్టీ) - మడకం ప్రసాద్

  • మధిర (ఎస్సీ) - చెరుకుపల్లి శారద

  • చేవేళ్ల (ఎస్సీ) - తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ

  • పరిగి - యంకెపల్లి ఆనంద్

  • రాజేందర్ నగర్ - ప్రొ. అన్వర్ ఖాన్

  • ఉప్పల్ - సుంకర నరేష్

  • మలక్ పేట్ - అల్లగోల రమేష్

  • చంద్రాయణగుట్ట - మూల రామ్ చరణ్ దాస్

  • నాంపల్లి - మౌలానా షఫీ మసూదీ

  • ఇబ్రహీంపట్నం - మల్లేష్ యాదవ్

  • శేరిలింగంపల్లి - ఒంగూరి శ్రీనివాస్ యాదవ్


Also Read: బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య "ఆపిల్" చిచ్చు - కర్ణాటకలో కేసు పెట్టిన డీకే శివకుమార్ !