BRS women leaders On Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మాట్లాడిన కవితపై బీఆర్ఎస్ మహిళా నేతలు ఫైరయ్యారు.పార్టీలో కవిత ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కీలక మహిళా నేతలు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి కవితపై విరుచుకుపడ్డారు.  గత మూడు నెలలుగా కవిత మాట్లాడుతున్న మాటలు చూశామమని..  పార్టీ అధినేత కేసీఆర్  తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు.  మూడు నెలలుగా కవిత తన తీరుతో పార్టీ కి ఎంతో నష్టం చేశారు .. బీ ఆర్ ఎస్ శ్రేణులను కవిత బాధకు గురి చేశారన్నారు.  ఈ రోజు కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం అందరినీ ముఖ్యంగా మహిళలను సంతోష పరిచిందన్నారు. 

పేగు బంధం కన్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే ముఖ్యమని కేసీఆర్ నిరూపించారని..  కార్యకర్తల కన్నా కుటుంబ సభ్యులు ఎక్కువ కాదని కేసీఆర్ నిరూపించారన్నారు.  కవిత కు నచ్చ చెప్పాలని చూసినా ఆమె వినలేదు కనుకే కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  పార్టీ తర్వాతే ఎవరైనా అని కేసీఆర్ సందేశం ఇచ్చారని..  కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్న తరుణం లో కవిత పార్టీని ఇబ్బంది పెట్టారని విమర్శించారు.  బీ ఆర్ ఎస్ శ్రేణులను కవిత తన మాటలతో గాయపరిచారని విమర్శించారు. 

హరీష్ రావు ,కే టీ ఆర్ లు కేసీఆర్ కు కుడి ఎడమ భుజాల్లాంటి వారని.. వారిద్దరిపై కవిత నిరాధార ఆరోపణలు చేశారన్నారు.  పీసీ ఘోష్ కమిషన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు .. అసెంబ్లీ లో హరీష్ రావు ఒంటి చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారన్నారు.  బీ ఆర్ ఎస్ శ్రేణులు హరీష్ రావు ప్రసంగాన్ని ఆస్వాదిస్తుంటే కవిత విమర్శించడం ఆమె ఏ లైన్లో ఉన్నారో రుజువు చేస్తోందని..  కేసీఆర్ కుమార్తె గా కవిత ఎక్కడికి వచ్చినా ప్రజలు స్వాగతం పలికారు కానీ.. ఆ గౌరవాన్ని కవిత నిలుపుకోక పోయారన్నారు. 

పార్టీ ఉంటె ఎంత పోతే ఎంత అని కవిత మాట్లాడొచ్చా ? పార్టీలో కవిత ఉంటె ఎంత లేకపోతే ఎంత అని ఆమె కు కేడర్ బదులిచ్చిందన్నారు.  కవితనే కేసీఆర్ కు మచ్చ తెచ్చిందని ప్రజలు భావించారని..  కేసీఆర్ నేడు తీసుకున్న నిర్ణయం గొప్పదని  మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.  కేసీఆర్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించారు ... తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ప్రజలే తన బాస్ లు అని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.  పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ తన ప్రసంగం లో సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదని..  దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ఓర్చుకోలేక పోయారన్నారు.  అందరికీ ఆ సభ నచ్చితే కవిత కు మాత్రం నచ్చలేదని..  పార్టీ ఉంటె ఎంత లేకుంటే ఎంత అని మాట్లాడావ్ ..క్షేత్ర స్థాయిలో ఎంత ఆగ్రహం ఉందో కవిత కు తెలుసా అని ప్రశఅనించారు. 

కవిత కేసీఆర్ ను ఏమని పిలుస్తుందో తెలియదు ..కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను బాపు అంటారని.... కవిత తనకు తానే గొయ్యి తవ్వుకున్నారు ....కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరో కాలుస్తున్నారు ..కాలగమనం లో అన్ని విషయాలు బయటకు వస్తాయని ప్రకటించారు.  కవిత పార్టీ పెడుతుందా పెట్టదా మాకు సంబంధం లేదని..  బీ ఆర్ ఎస్ నుంచి దూరమై పార్టీ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదన్నారు.