Nara Lokesh Mocks YS Jagan: వైఎస్సార్పీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డిని టార్గెట్ చేయడానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని తెలుగుదేశం విడిచిపెట్టడం లేదు. జగన్ మోహనరెడ్డి పర్యటనలకు వచ్చినా.. ప్రెస్‌మీట్‌లు పెట్టినా.. అందులో నుంచి ఏదో ఓ అంశాన్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, నాయకులు జగన్‌ను ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి నేరుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్‌పై సెటైర్లు వేశారు. “ఓరి నీ పాసుగాల…!” అంటూ నెల్లూరు, కడప ప్రాంతంలోని సామెతతో జగన్‌ను టీజ్ చేశారు. ఇంతకీ ఆయనెందుకు అలా అన్నారంటే..

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహనరెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి ఆయన సోమవారం పులివెందుల వచ్చారు. ఇవాళ వైఎస్సార్ వర్థంతి కార్యక్రమం ఉండటంతో ఒకరోజు ముందే ఆయన పులివెందుల వచ్చి స్థానిక నాయకులను కలిశారు. అయితే సొంత నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు జగన్‌ను కలవడానికి ఇబ్బంది పడ్డారు. లోకల్ వాళ్లకి కూడా VIP పాసులు జారీ చేశారు.

సాధారణంగా సొంత నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానిక నాయకులు కలుస్తారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి అయినప్పుటికీ పులివెందులకు ఎమ్మెల్యే. స్థానిక ప్రజాప్రతినిధి. ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతల్లో ఉండగా.. జగన్ పులివెందులకు టైమ్ కేటాయించలేక పోయారు. కానీ ఇప్పుడు కూడా ఆయన కార్యకర్తలను నేరుగా కలవలేదన్న అభిప్రాయం ఉంది. . పైగా వాళ్లని కలవడం కోసం పాసులు జారీ చేయడం విమర్శలకు కారణమైంది. జగన్ కార్యాలయం జారీ చేసిన వీఐపీ పాసులు సోషల్ మీడియాలో కనిపించాయి. వాటితో పాటే కొంతమంది కార్యకర్తలు.. ప్రతిపక్షంలోకి వచ్చినా జగన్ దర్శనం దొరకడం లేదంటూ వారు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌ను ట్రోల్ చేసిన లోకేష్ Nara Lokesh Satire on Jagan:

పులివెందుల కార్యకర్తలకు పాసులు జారీ చేసిన విషయాన్ని టీడీపీ క్యాచ్ చేసింది. సొంత పార్టీ వాళ్లను కలవడానికి కూడా పాసులు ఏంటంటూ ట్రోల్ చేసింది. అధికారం కోల్పోయినా.. ఎమ్మెల్యేగా పరిమితం అయినా జగన్ ధోరణి ఏం మారలేదంటూ టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కామెంట్లు మొదలుపెట్టారు. అయితే ఆ పార్టీ కార్యకర్తలే కాదు.. నేరుగా లోకేష్ కూడా ఎటాక్ చేశారు. కడప స్టైల్‌లో “ఓరి నీ పాసుగాల.. సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం కానీ..సొంత నియోజకవర్గంలో... సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్య.. నేను ఎక్కడా సూడలా..." X హ్యాండిల్‌లో అంటూ ర్యాగింగ్ చేశారు.

 

 

జగన్‌మోహనరెడ్డి రెండు రోజుల పర్యటన కోసం కడప జిల్లాకు రాగా.. నారా లోకేష్ కూడా మంగళవారం కడప జిల్లాలోనే ఉన్నారు. కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు.