TVS Orbiter Hyderabad On Road Price : TVS భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Orbiter ని విడుదల చేసింది. వాస్తవానికి, ఇది కంపెనీకి ఇది మూడో ఈ-స్కూటర్, iQube, X తర్వాత ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా ఎంట్రీ-లెవెల్ మోడల్‌గా ప్రారంభించారు. స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,900 గా నిర్ణయించారు. కంపెనీ వెబ్‌సైట్‌లో కేవలం రూ. 5,001 తిరిగి చెల్లించదగిన మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. దీని డెలివరీ దీపావళి 2025 తర్వాత ప్రారంభమవుతుంది. వివరంగా తెలుసుకుందాం.

Continues below advertisement


బ్యాటరీ - రేంజ్‌


TVS Orbiter 3.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ 158 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ రేంజ్‌ ఈ విభాగంలో ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఎందుకంటే iQube ఇదే బ్యాటరీ ప్యాక్ కేవలం 123 కిమీ  రేంజ్‌ను అందిస్తుంది. iQube 3.5 kWh బ్యాటరీ ప్యాక్ కూడా 145 కిమీ కంటే ఎక్కువ వెళ్ళదు. ఈ విధంగా Orbiter రేంజ్‌ పరంగా TVS అత్యుత్తమ ఈ-స్కూటర్.


డిజైన్ -ఫీచర్లు


కంపెనీ Orbiterని "భారతదేశపు అత్యంత ఏరోడైనమిక్ ఈ-స్కూటర్" అని పేర్కొంది. దీని మినిమలిస్ట్,  ఆధునిక డిజైన్ LED హెడ్‌లైంప్, ఫ్రంట్ విండ్‌స్క్రీన్, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. స్కూటర్‌లో 290mm ఫుట్‌బోర్డ్ ఎక్కువ లెగ్‌రూమ్‌ను అందిస్తుంది. 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ కూడా ఉంది. దీనితోపాటు, ఇందులో రెండు రైడ్ మోడ్‌లు - ఎకో, పవర్, రీజెనరేటివ్ బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, USB ఛార్జింగ్ స్లాట్, రివర్స్ మోడ్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.


స్మార్ట్ కనెక్టివిటీ


ధర ఎంట్రీ-లెవెల్ అయినా, ఫీచర్లు ఏదైనా ప్రీమియం ఈ-స్కూటర్ కంటే తక్కువ కాదు. TVS Orbiterలో కలర్డ్ LCD డిస్‌ప్లే ఉంది, ఇది స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా రైడర్‌కు కాల్ అలర్ట్‌లు, నావిగేషన్, లైవ్ లొకేషన్, జియో-ఫెన్సింగ్, ఫాల్ డిటెక్షన్, థెఫ్ట్ అలర్ట్, OTA అప్‌డేట్‌లు వంటి హై-టెక్ సౌకర్యాలు లభిస్తాయి.


కలర్‌ ఆప్షన్స్‌


కస్టమర్‌లకు TVS Orbiter 6 వేర్వేరు రంగులలో అందుబాటులో ఉంది. వీటిలో నియాన్ సన్‌బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్టియన్ కాపర్ ఉన్నాయి. ఇన్ని రంగుల ఎంపికలు యువత, స్టైల్ ఇష్టపడే వారి కోసం మరింత ప్రత్యేకంగా చేస్తాయి.



హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ప్రైస్ ఎంత? డౌన్‌పేమెంట్‌ ఎంత చెల్లించాలి?


టీవీఎస్‌ Orbiter Standard వేరియెంట్‌ హైదరాబాద్‌లో కొనుక్కోవాలంటే 1,07,436 రూపాయలు చెల్లించాలి. ఈ స్కూటర్ రైడింగ్ రేంజ్‌ 158 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ధరకు లభించే మిగతా స్కూటర్లతో పోల్చుకుంటే 78 శాతం బెటర్ అని కంపెనీ చెబుతోంది. గంటకు 68 కిలోమీటర్లతో వెళ్లొచ్చని కూడా కంపెనీ పేర్కొంది. కెర్బ్‌ వెయిట్‌ 112 కిలోలు. 
హైదరాబాద్‌లో ఈ స్కూటర్ కొనాలి అంటే మీరు 5,371 రూపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించాలి. 
మిగతా 1,02,064 రూపాయలను లోన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లోన్‌ను పది శాతం వడ్డీ రేటుతో మూడేళ్లకు తీసుకుంటే నెలకు 3,686 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. 


నెలకు 10 శాతం వడ్డీకి 1,02,064 రూపాయలను నాలుగేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎంఐ- రూ. 2,977 


నెలకు 10 శాతం వడ్డీకి 1,02,064 రూపాయలను ఐదేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎంఐ- రూ. 2,552


నెలకు 10 శాతం వడ్డీకి 1,02,064 రూపాయలను రెండేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎంఐ- రూ. 5,103


నెలకు 10 శాతం వడ్డీకి 1,02,064 రూపాయలను ఏడాది టెన్యూర్‌కు తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎంఐ- రూ. 9,356