Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు

Telangana: సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై రేవంత్ మాట్లాడారని బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. రేవంత్ సభా నియమాలు ఉల్లంఘించారని హరీష్ రావు ఆరోపించారు.

Continues below advertisement

BRS: సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ అంశంపై స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టి ఆ తర్వాత వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి  సభలో మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థకు విరుద్ధం విరుద్ధమని మాజీ శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్ లో స్పష్టంగా ఉందన్నారు. కోర్టు పరిధిని అధిగమించి ముఖ్యమంత్రి మాట్లాడారని.. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చారని మండిపడ్డారు. సభకు ఇమ్యూనిటీ ఉంది, సభలో కోర్టుల గురించి కూడా మేం ఏదైనా మాట్లాడవచ్చునని రేవంత్ అంటున్నారని అది సరైనది కాదని హరీష్ స్పష్టం చేశారు   

Continues below advertisement

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్ క్వాలిఫై కారు, ఉప ఎన్నికలు రానే రావు అని జడ్జిమెంట్ ఇచ్చారు.   ముఖ్యమంత్రి తన పరిధిని దాటి సుప్రీంకోర్టులో ఉన్న విషయం మీద మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకే వస్తుందన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద నేను చెప్పే ప్రయత్నం చేస్తే మధ్యలో నా మైక్ కట్ చేశారని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చని ముఖ్యమంత్రి చెప్పారు, కానీ సలహాలు ఇవ్వడానికి మైక్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని.. ప్రతిపక్షం గొంతు నొక్క ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ సభ్యులు ఉన్నవారికి మైక్ ఇస్తున్నారు, మాకు ఇవ్వడం లేదన్నారు. 

టిఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో బెట్టింగ్ యాప్స్ ని కంట్రోల్ చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ఆరు గంటలకు ఒక హత్య జరగుతోందని.. లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయడంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫెయిలయ్యారని విమర్శించారు.  అధికారికంగా విడుదల చేసిన లెక్క ప్రకారం గత సంవత్సరం కంటే 23% క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పారన్నారు. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు.  నిన్న ఒకరోజే హైదరాబాదులో రెండు అత్యాచార ఘటనలు రెండు హత్యలు జరిగాయి. హైదరాబాదులో 50% సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. పెట్టిన సీసీ కెమెరాలును మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారన్నారు. 
   
పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ెస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.  తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ చేస్తున్న  ప్రచారాన్ని సీఎం రేవంత్ కొట్టి పారేశారు. గతంలో రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని ప్రశ్నించారు.  పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదని.. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నామని ..సభ్యులెవరూ ఆందోళన చెందొద్దని పార్టీ మారిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపైనే హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Continues below advertisement