Just In





Bhadrachalam Latest News: భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
Building Collapse In Bhadrachalam :నిర్మాణంలో ఉన్న లోపాలు కారణంగా భద్రాచలంలో ఓ ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందారు.

Bhadrachalam Latest News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలు ఆ భవనం కింద పని చేస్తున్న టైంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న లోపాలు కారణంగానే భవనం కుప్పకూలినట్టు తెలుస్తోంది. .
భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్‌లో నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు ఇందులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. శిథిలాలను తొలగించి క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
కుప్పకూలిన భవనంపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. నిర్మాణ లోపాలు కారణంగానే ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఓ ట్రస్ట్ పేరు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. అయితే ట్రస్టు పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం ఎక్కడా రూల్స్ పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఆ భవనంపై చాలా ఫిర్యాదులు అధికారులుక వచ్చాయి.
భద్రాచలంలో కుప్పకూలిన భవనంపై ఉన్న ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలోనే నోటీసులు జారీ చేశారు. నాసిరకం మెటీరియల్‌తో కడుతున్నారని గ్రహించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ చర్యలకు ఆదేశించారు. కూల్చివేయాలని అధికారులకు చెప్పారు.
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందుకున్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడే అధికారులు చర్యలు తీసుకొని భవనాన్ని కూల్చి వేసి ఉంటే కచ్చితంగా ప్రాణాలు నిలబడేవి అంటున్నారు స్థానికులు. ఇలాంటి భవనాలు భద్రాచలంలో చాలానే ఉన్నాయని అంటున్నారు. వాటిపై చాలా ఫిర్యాదులు ఉన్నప్పటికీ పట్టించుకునే వాళ్లు లేరని విమర్శిస్తున్నారు.