MLA Gampa Govardhan: రైస్‌మిల్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ రెడ్డి చేయి చేసుకున్నాడు. కామా రెడ్డి జిల్లా భిక్నూర్‌ మండలం పెద్దమల్లారెడ్డిలో ఘటన వెలుగుచూసింది. అం తకుముందు రైస్‌మిలర్లు తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఎ మ్మెల్యే గంప గోవర్ధన్‌కు ఫిర్యాదు చేశారు రైతులు. దీంతో నేరుగా రైస్‌మిల్‌కు వెళ్లారు ఎమ్మెల్యే. ధాన్యం కొనుగోలుపై రైస్‌మిల్‌ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్షపు సమాధానంపై కోపం తెచ్చుకున్న గంప గోవర్ధన్.. సిబ్బందిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గుమస్తాపై దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు రైస్ మిల్ వ్యాపారస్తులు. 


ధాన్యం మిల్లింగ్‌లో మిల్లర్ల నిర్లక్ష్యం



అకాల వర్షాలతో పంట కోసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పంట కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు ప్రారంభించారు. సీఎమ్మార్‌ బియ్యం  ఇవ్వటంలో జాప్యం చేస్తున్న మిల్లులపై ఇప్పటికే ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.  సకాలంలో సీఎమ్మార్‌ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని పలుమ మార్లు హెచ్చరించారు.   కొందరు మిల్లర్లు డీఫాల్ట్‌ అయ్యారు.  ఇప్పటివరకు సీఎమ్మార్‌ విధానంలో లేని మిల్లులు ఈసారి కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే ధాన్యం తీసుకోవాలని చెబుతున్నారు. కనీ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


ప్రజాప్రతినిధులపై పెరుగుతున్న రైతుల ఒత్తిడి 
 
రాష్ట్రంలో కొందరు మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.   ఎప్పటికప్పుడు ధాన్యానికి సంబంధించిన సీఎమ్మార్‌ (బియ్యం)ను సకాలంలో డెలివరీ చేయాల్సిన బాధ్యత మిల్లులపై ఉన్నది. కానీ కుంటిసాకులు చెప్తూ ప్రతీ సీజన్‌లో సీఎమ్మార్‌ను ఆలస్యం చేస్తున్నారు. ఓవైపు సీఎమ్మార్‌ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేస్తుంటే మరోవైపు గడువు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటున్నది. గడువు ముగిసిన తర్వాత సీఎమ్మార్‌ను తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. ఈ విధంగా మిల్లర్ల ఆలస్యంతో 2019-20, 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల విలువైన 2 లక్షల టన్నులకు పైగా బియ్యం ఇక్కడే నిలిచిపోయాయి. దీంతో ఆ భారం మొత్తం పౌరసరఫరాల శాఖపై పడుతున్నదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. అదే సమయంలో రైతులూ ఇబ్బంది పడుతున్నారు. 


మిల్లర్లపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం            


 మిల్లర్లు పథకం ప్రకారమే ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్దేశించిన గడువు లోగా సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ఇవ్వాలంటూ అధికారులు మిల్లర్లకు పలుసార్లు వార్నింగ్​ ఇచ్చారు.  మిల్లింగ్​ చేయడానికి గడువు కూడా పెంచారు. మిల్లుల కెపాసిటీని ప్రాతిపదికగా  చేసుకొని నిర్మల్ జిల్లాతో  పాటు సమీపంలో  ఉన్న పెద్దపల్లి మరికొన్ని జిల్లాలకు సీఎంఆర్​ కోసం ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అయితే సివిల్​ సప్లై శాఖ ఇచ్చిన గడువులు దాటిపోతుండడం, మళ్లీ ఇంకా సమయం పెంచుతుండటం రివాజుగా మారింది. రైతుల ఒత్తిడి పెరుగుతూండటంతో ప్రజా ప్రతినిధులు కూడా మిల్లర్లపై అసంతృప్తి  బహిరంగంగానే చూపిస్తున్నారు.