BRS ight against the Congress government :   దక్షిణ తెలంగాణ లీడర్లతో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయ్యారు.  ఈ సంద్భంగా కేసీఆర్ ఈనెల 13 న నల్లగొండ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు… నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇదంతా పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడం తో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ లు ఆధీనం లోకి వెళితే తెలంగాణ నష్టపోతుందని, కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 


డ్యాం కు సున్నం వేయాలన్న కూడా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 13న సభ నిర్వహించి తీరుతామని కేసీఆర్‌ అన్నారు.  బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు సాగునీటి పరిరక్షణను అప్పగించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం వల్ల కలిగే పరిణామాలపై చంద్రశేఖర్ రావు చర్చకు నాయకత్వం వహించారు. KRMB, తద్వారా రాష్ట్ర రైతులకు కలిగే నష్టాలు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరిపై అనుసరించాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. 


తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ తెలంగాణ సాగునీటి, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే ‘మా నీళ్లు మాకే’ (మన నీరు మనకే) అనే నినాదాన్ని నిజం చేసిందని పేర్కొన్నారు. కేంద్రం ఒత్తిడిని ఎదిరిస్తూ కృష్ణా నది ప్రాజెక్టులపై తెలంగాణ హక్కులను కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాపాడింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని, ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తున్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామన్నారు.


హైదరాబాద్ రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనన్నారు.  కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడుతామన్నారు.