Vijay Deverakonda Reaches 21 Million Followers on Instagram : రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో భారీ పాపులారిటీని అందుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ యంగ్ హీరో. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో మరో మైలురాయిని అందుకున్నాడు.


ఇన్ స్టాగ్రామ్ లో రౌడీ హీరో నయా రికార్డ్


విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అలా అందరు హీరోల కంటే ఎక్కువ పాపులారిటీని సోషల్ మీడియా ద్వారా సొంతం చేసుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న విజయ్ దేవరకొండ కి మరో మిలియన్ ఫాలోవర్స్ యాడ్ అయ్యారు.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య 21 మిలియన్ కి చేరుకుంది. ఈ ల్యాండ్ మార్క్ తో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 24 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు. విజయ్ సరికొత్త ఫీట్ పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


రామ్ చరణ్ ని వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండ ఈ రేర్ ఫీట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని వెనక్కి నెట్టాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ని రోజులు బన్నీ తర్వాతి స్థానంలో చరణ్ 20.6 మిలియన్ల ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా.. 21 మిలియన్ల ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని ఇంత తక్కువ సమయంలో వెనక్కి నెట్టడం అంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి రౌడీ హీరో డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. 


'ఫ్యామిలీ స్టార్' అంటూ రాబోతున్న విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్. 'గీత గోవిందం' మూవీ ఫేమ్ పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 'గీతా గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడం, అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండడంతో 'ఫ్యామిలీ స్టార్' మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ టీజర్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : కంగనాతో సినిమా చేస్తానన్నా సందీప్ రెడ్డి వంగా, షాకింగ్ రిప్లై ఇచ్చిన హీరోయిన్