KCR Tour In Karimnagar: రైతులు ధైర్యంగా ఉండాలని.. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన ముగ్ధుంపూర్ లో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు ఆయనకు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గులాబీ బాస్ దృష్టికి తెచ్చారు. మంచినీళ్లకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు చెప్పారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో రైతులతో ముచ్చటించనున్న అనంతరం వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 














జేబుదొంగ హల్ చల్


అటు, కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో జేబు దొంగలు హల్ చల్ చేశారు. పలు మండలాల్లో ఆయన ఎండిన పంటలను పరిశీలిస్తుండగా ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ.10 వేలు కొట్టేశాడు. అయితే, దొంగను పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు.


Also Read: Delhi liquor scam case : సీన్‌లోకి సీబీఐ - కవితను ప్రశ్నించేందుకు అనుమతి కావాలని కోర్టులో పిటిషన్