Vaddiraju Ramachandra As BRS Rajyasabha Candidate: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) పేరును ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఈ మేరకు పార్టీ పెద్దలు, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 (గురువారం) వరకూ గడువు ఉండడంతో.. వద్దిరాజు గురువారం నామినేషన్ వేయనున్నారు. వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొదటి ధపాలో రెండేళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.






కాంగ్రెస్ నుంచి ఇద్దరు 


అటు, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ (Telangana Congress) నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకాచౌదరి (Renuka Chowdary), అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) పేర్లను ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. ఈయన ప్రస్తుతం సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 (గురువారం) వరకూ అవకాశం ఉండడంతో వీరంతా గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.


కాగా, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 3 స్థానాలకు ఇరు పార్టీల తరఫున ముగ్గురే నామినేషన్లు వేయనుండడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు.


Also Read: Police Transfer: తెలంగాణలో 95 మంది డీఎస్పీల బదిలీ, 3 రోజుల్లోనే అంత మంది ట్రాన్స్‌ఫర్ అయ్యారా?