బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే, ఈ ప్రచారాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండించారు. తాను పార్టీని వదలనని, బీజేపీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. 


‘‘రెండు రోజుల నుండీ రాములమ్మ బీజేపీ పార్టీతో దూరమవుతున్నారు. పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నవని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. ఇది సరైనదో కాదో ప్రచారం చేసేటోళ్లకు తెలియాలి. నేనైతే మహాశివుని కాశీ మహాపుణ్యక్షేత్రం, *"గరళకంఠుని"* సన్నిధానంలో ఆ ఆది దేవుని దర్శనార్థమై... హరహర మహాదేవ్’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.



అంతకుముందు గతేడాది అక్టోబరులో కూడా విజయశాంతి పార్టీ మారతారని ఇలాంటి ప్రచారమే జరిగింది. అప్పుుడు కూడా విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకు తెలంగాణ బీజేపీ నాయకత్వంతో సమస్యలు ఉన్నట్టు టీఆర్‌ఎస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఒక తీవ్రమైన కుట్ర. ఇది అవాస్తవం. ఒకవేళ అదే నిజమని ఎవరైనా భావిస్తున్నట్లయితే వారు ఒక నిజం తెలుసుకోవాలి. నేను పనిచేసుకోవడానికి తెలంగాణతో పాటు నా బీజేపీలోనే అనేక దక్షిణాది, మరికొన్ని ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ నుండి వీడిపోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర బీజేపీతో దూరం వెళ్లిపోవాల్సినంత భేదాభిప్రాయాలు నాకేమీ లేవు’’ అని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.