MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం న్యాయపోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు భారత్ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఈ అంశంపై పెండింగ్ లో ఉన్నపిటిషన్ లో ఇంప్లీడ్ అవుతామని ఆమె అన్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించిన తాము వాటిని తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. 


మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణ అమలు కోసం పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే పలు పార్టీలు, సంస్థలు కోర్టుకు వెళ్లాయని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో భారత్ జాగృతి తరపున తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో తాము ఇంప్లీడ్ అవుతామని కవిత ప్రకటించారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. భారత్ జాగృతి పోరాటం కారణంగానే రిజర్వేషన్లకు ఆమోదం వచ్చిందన్నారు.


చేనేత కార్మికులకు అండగా..
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దారిదీపమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఇటీవల మహారాష్ట్రలోని సోలాపూర్‌కు వెళ్లిన కవిత అకడి వస్త్ర పరిశ్రమలను సందర్శించారు. వాటి నిర్వాహకులతో, కార్మికులతో మాట్లాడారు. మహారాష్ట్రలో చేనేత కార్మికులు పడుతున్న బాధలు, కష్టాలు తీరాలంటే తెలంగాణ అభివృద్ధి నమూనానే ఏకైక పరిషారమని కవిత చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత పురోగతి సాధించిందని తెలిపారు. కేసీఆర్‌ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. 


చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం దేశంలో ఎకడా లేనన్ని కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో వస్త్ర పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమలకు నీటి కొరత, విద్యుత్తు కొరత తీవ్రంగా ఉన్నదని, విద్యుత్తు చార్జీలు కూడా చాలా ఎకువగా ఉన్నాయని కార్మికులు కవిత దృష్టికి తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వస్త్ర, చేనేత పరిశ్రమదారులు, కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వారు ప్రశంసించారు. 


చేనేత పరిశ్రమకు అనేక రాయితీలు
తెలంగాణలో పవర్‌లూమ్‌ పరిశ్రమలకు సీఎం కేసీఆర్‌ అనేక రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలకు నీటి కొరత, విద్యుత్తు కొరత లేకుండా సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో సంసరణలు చేపట్టారని అన్నారు. ఫలితంగా పరిశ్రమలు నడుపుతున్న వారికే కాకుండా కార్మికులు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. బతుకమ్మ చీరలను రాజకీయం చేసిన కాంగ్రెస్‌కు మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారని తేల్చి చెప్పారు.